తెలుగు ఇండస్ట్రీలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ మద్య బయోపిక్ లపై ఎక్కువ మోజు చూపిస్తున్నారు.  ఆ మద్య కిల్లర్ వీరప్పన్ బయోపిక్ తో మంచి విజయం అందుకున్న ఆయన ఇటీవల ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’తో మరో ఘన విజయాన్ని అందుకున్నాడు.  తాజాగా రాంగోపాల్ వర్మ తెలంగాణ పోరాట యోధుడు..ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఓ బయోపిక్ ప్లాన్ చేస్తున్నానని ఆ మద్య తెలిపారు. 

తెలంగాణ సాధ‌నలో కేసీఆర్ పాత్ర‌ను ఇందులో చూపించ‌నున్నారు. నిన్న ఆ సినిమా టైటిల్ కూడా రివీల్ చేశారు.  అయితే కేసీఆర్ బయోపిక్ లో ముఖ్యపాత్రలు ఇవే అంటూ మరో ట్విట్ పెట్టారు.

టైగర్ కేసీఆర్ అనే ఈ బయోపిక్ లో  కేసీఆర్‌, కేటీఆర్‌, క‌విత‌, హ‌రీష్ రావు, వైఎస్సార్‌, వైఎస్ జ‌గ‌న్‌, చంద్ర‌బాబు నాయుడు, ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్‌, ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్, రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి, రామోజీరావు, లోక్‌ష్ వంటి ప్రముఖ వ్యక్తుల పాత్రలను చూపించబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: