జూనియర్ ఎన్టీఆర్ తాజా ట్వీట్లు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. ఆయన రూట్ ఏంటో కూడా చెప్పకనే చెబుతున్నాయి. ఆయన కామెంట్స్ చూసిన వారు అపుడలా. ఇపుడిలా అంటే జూనియర్ తానేంటి అన్నది ఇలా చెప్పేశారా అంటున్నారు. అసలు జూనియర్ వేస్తున్న అడుగులు, ఆయన నడక కూడా చాలా విషయాలనే  చెబుతోందని అంటున్నారు.


సొంత బాబాయ్ ప్రాణం పెట్టి తీసిన సినిమా కధానాయకుడు, మహానాయకుడు. ఈ రెండు మూవీస్ విషయంలో తారక్ ఏ మాత్రం స్పందించలేదు. ఆఖరుకు మహేష్ బాబు వంటి వారు బాలయ్య యాక్షన్ సూపర్ అంటూ ట్వీట్లు చేసినా తారక్ మాత్రం మౌనం పాటించారు. మరి ఇదే తారక్ ఇపుడు తెగ రెచ్చిపోయి నాని జెర్సీ మూవీకి ట్వీట్లు చేస్తున్నారు. నిన్న రిలీజ్ అయిన జెర్సీ మూవీ సూపర్ హిట్, నానీ బ్రో నీ నటనకు హాట్సాఫ్ అంటూ జూనియర్ ట్వీట్లు పెట్టారు.


మరి ఇదే జూనియర్ తన తాత అన్న గారి మీద తీసిన మూవీ విషయంలో మాత్రం ఎందుకు రెస్పాండ్ అవలేదన్న చర్చ ఇపుడు ముందుకు వస్తోంది. నిజానికి జూనియర్ కి ఇష్టం లేకపోవడం వల్లనే  ఇలా చేసి ఉంటారని అనుకుంటున్నారు. కధానాయకుడు ఆడియో ఫంక్షన్ కి వెళ్ళిన జూనియర్ బాలయ్యని తెగ పొగిడారు. ఆ తరువాత మాత్రం ఎక్కడా ఆ వూసు లేదు. ఇక ఆయన మెగా క్యాంప్ తో కలిసి తిరగడం పట్ల బాలయ్య గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ ఇద్దరి విభేదాలు ఇప్పట్లో వీడేవి కావని టాలీవుడ్లో అనుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: