నేచురల్ స్టార్ నాని, కన్నడ బ్యూటీ శ్రద్దా శ్రీనాథ్ నటించిన ‘జెర్సీ’నిన్న రిలీజ్ అయ్యింది.  గౌత‌మ్ తిన్నూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదటి నుంచి ఎన్నో అంచనాలు పెంచుతూ ఉంది.  ఈ మద్య రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.  ఇక నిన్న రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  


ఈ సినిమా వీక్షించిన టాలీవుడ్ సెలబ్రెటీలు నాని నటనకు ఖితాబు ఇస్తున్నారు.  నిన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమా చూసి నాని నటనకు ఫిదా అయ్యారు.  దర్శకుడు గౌతమ్ చాలా చక్కగా మూవీని తీర్చి దిద్దారని..ఎక్కడా ఎలాంటి బోర్ ఫీలింగ్ లేకుండా చూశాడని..హీరోయిన్ శ్రద్ద కూడా చక్కగా నటించిందని తెగ మెచ్చుకున్నాడు.


మంచు మనోజ్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ గౌతమ్‌ తిన్ననూరికి హృదయపూర్వక అభినందనలు. అందమైన, భావోద్వేగా లతో నిండిన చిత్రం ‘జెర్సీ’. చిత్రబృందానికి ఛీర్స్‌. తప్పకుండా చూడాల్సిన చిత్రమిది" అని మనోజ్‌ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 


తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా `జెర్సీ`పై ట్విట‌ర్ ద్వారా ప్ర‌శంస‌లు కురిపించాడు.అంద‌రూ క‌చ్చితంగా చూడాల్సిన మూవీ అని అభిప్రాయ‌ప‌డ్డాడు. సినిమాలో ప్ర‌తీ సీన్‌ను ఆస్వాదించాను. చిత్ర‌యూనిట్‌కు అభినంద‌న‌లు. నాని.. నువ్వు అద్భుతంగా న‌టించావు. ఇప్ప‌టివ‌ర‌కు నువ్వు చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్‌ అని చెప్పారు. స్ట‌డీ అండ్ బోల్డ్. సినిమా ప్రేమికులంద‌రూ ఈ సినిమాను క‌చ్చితంగా చూడాలంటూ బ‌న్నీ ట్వీట్ చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: