ఎట్టకేలకు ఆరు ఫ్లాపుల తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టాడు. ఆరు వరుస ఫ్లాపులతో డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్లు సాధించిన హీరోగా నిలిచిన సాయి ధరంతేజ్ కెరీర్‌కు ఆక్సిజన్ అందించింది. గత శుక్రవారం విడుదలైన చిత్రలహరి తొలి వారం ముగిసే సరికి బ్రేక్ ఈవెన్ సాధించి లాభాల బాట పట్టింది.  సాయి ధరమ్ తేజ్ మార్కెట్ బాగా డౌన్ అవడంతో చిత్రలహరి సినిమాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం పది కోట్లకు మాత్రమే అన్నారు. తొలి వారం ముగిసే సరికి తెలుగులో 10. 70 కోట్లను రాబట్టిన చిత్రలహరి వరల్డ్‌వైడ్‌గా 11.42 కోట్ల షేర్ కొల్లగొట్టింది. తొలి వారం ముగిసే సరికి అంతా సేఫ్ జోన్ లోకి వెళ్లి ఇప్పుడే లాభాల బాట పడుతున్నారు.

Image result for chitralahari

చిత్రలహరి లాభాల బాటలో కి వెళుతుంది అనుకుంటున్న టైంలో సాయి ధరంతేజ్ కు నేచుర‌ల్ స్టార్ 
నాని పెద్ద దెబ్బ కొట్టాడు. నాని నటించిన సినిమా శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. జెర్సీ తొలి ఆట నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని తొలిరోజే మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో చిత్రలహరి రెండోవారంలో మరిన్ని లాభాలు సాధిస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందని బ‌య్య‌ర్లు చెబుతున్నారు. విన్నర్ సినిమా టైంలో సాయిధరమ్ తేజ్‌ మార్కెట్ ఏకంగా 30 కోట్ల నుంచి 35 కోట్ల వరకు వెళ్ళింది. అలాంటి హీరో ఇప్పుడు పది కోట్లు సాధించడమే చాలా కష్టంగా ఉంది. సాయి ఇప్పటికైనా సరైన కథలు ఎంపిక చేసుకుని నాలుగు ఫైట్లు... డ్యాన్సులు ఫార్మాట్‌కు ముగింపు పలికే మంచి భవిష్యత్తు ఉన్న హీరో అవుతాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Image result for jersey movie

ఇక ఇప్పుడు చిత్ర‌ల‌హ‌రితో ఏదో ఓ మోస్త‌రు హిట్ కొట్టి లాభాల భాట‌లోకి వెళుతున్నాడు అనుకుంటున్న టైంలో నాని జెర్సీ రూపంలో చిత్ర‌ల‌హ‌రికి అదిరిపోయే షాక్ త‌గిలింది. స‌మ్మ‌ర్ కావ‌డం... సినిమాకు ఓ మోస్త‌రు టాక్ రావ‌డంతో సాయి ఏదోలా రూ.15-18 కోట్ల వ‌ర‌కు లాగుతాడ‌ని అనుకున్నా ఇప్పుడు జెర్సీకి వ‌చ్చిన టాక్‌తో అంద‌రూ ఆ సినిమా ఆడుతోన్న థియేట‌ర్ల‌కే క్యూ క‌డుతున్నారు. దీంతో సాయి సినిమాకు దెబ్బ‌ప‌డిపోయింది. సాయి బ్యాడ్ ల‌క్ అనుకోవ‌డం మిన‌హా చేసేదేం ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: