నాగార్జున ‘మన్మధుడు 2’ షూటింగ్ కు సంబంధించి కీలక సన్నివేశాలు ప్రస్తుతం పోర్చుగల్ లో షూట్ చేస్తున్నారు. నాగార్జున ఈమూవీ షూటింగ్ లో అందర్నీ ఉత్సాహపరుస్తూ ప్రవర్తిస్తున్న తీరుకు దర్శకుడు రాహుల్ రవీంద్రన్ జోష్ లోకి వెళ్ళిపోతున్నాడని సమాచారం. 

లేటెస్ట్ గా దర్శకుడు రాహుల్ ఈమూవీ షూటింగ్ జరుగుతున్న ఒక అటవీ ప్రాంతంలో నాగార్జున కసరత్తులు చేస్తూ అందరికీ షాక్ ఇస్తున్న ఒక ఫోటోను షేర్ చేసి అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ‘మన్మధుడు 2’ కథకు సంబంధించి ఒక ఆసక్తికర లీక్ బయటకు వచ్చింది. 

ఈసినిమాలో నాగార్జునకు నలుగురు చెల్లెళ్ళు అని తెలుస్తోంది. తన చెల్లెళ్ళను విపరీతంగా ప్రేమించే నాగ్ తన చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేసే సందర్బంలో నాగ్ తన పెళ్లి విషయం మరిచిపోవడంతో తన చెల్లెళ్ళు పెళ్ళి అయ్యేసరికి నాగార్జున మధ్య వయస్కుడు అయిపోతాదట.  ఆ పరిస్థుతులలో పెళ్ళి మీద ఆసక్తి కోల్పోయిన నాగార్జునను అతడి చెల్లెళ్ళ సహకారంతో రకుల్ ప్రీత్ నాగార్జునను ప్రేమలోకి దింపుతుందని సమాచారం. 

ఇప్పుడు లీక్ అవుతున్న ఈకథను బట్టి చాల సంవత్సరాల క్రితం 1997 ప్రాంతాలలో చిరంజీవితో ముత్యాల సుబ్బయ్య తీసిన ‘హిట్లర్’ సినిమా గుర్తుకు వస్తుంది. దీనితో రాహుల్ రవీంద్రన్ చిరంజీవి హిట్లర్ సినిమాను ప్రేరణగా తీసుకుని అదే సిస్టర్ సెంటిమెంట్ తో ఇజ్రాయల్ బ్యాక్ డ్రాప్ తో ‘మన్మధుడు 2’ తీస్తున్నాడా అని సందేహాలు కలగడం సహజం..  



మరింత సమాచారం తెలుసుకోండి: