టాలీవుడ్ లో అందరూ ఊహించినట్టుగానే నాని మరో ఘనవిజయాన్ని అందుకున్నాడు.   గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ మూవీ సూపర్ హిట్  టాక్ వచ్చింది. మొదటి నుంచి ఈ సినిమా కోసం ఎన్నో కష్టాలు పడ్డానని నాని ఆ మద్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  క్రికెట్ అంటే ఎదో గ్రౌండ్ లో వచ్చి బ్యాట్ తో కెమెరా ట్రిక్ చూపించడం కాదు..నిజంగా ప్రేక్షకులకు ఓ ప్రొఫెషనల్ క్రికెటర్ ఆడినట్లు అనుభూతి కలిగేలా ఈ సినిమా ఉంటుందని చెప్పారు.  ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. 

ఇదే సమయంలో క్రికెట్ నేపథ్యంలో జెర్సీ అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది.  ఈ సినిమాలో లవ్, ఎమోషన్, క్రికెట్ అన్ని కలిసొచ్చాయి.  భలే భలే మగాడివోయ్ సినిమా తర్వాత వరుస విజయాలు అందుకుంటున్న నాని ఆ మద్య కృష్ణార్జున యుద్దం, దేవదాసు సినిమాలతో నిరాశపరిచాడు.  తాజాగా ఈ సినిమా కలెక్షన్లు కూడా బాగా రాబడుతుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా మంచి ఓపెనింగ్స్ ను అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 4.6 కోట్ల షేర్స్ అందుకున్న జెర్సీ ఓవర్సీస్ లో 1.70కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది.

ఇక కర్ణాటక లో కోటికి పైగా కలెక్షన్స్ రాగా వరల్డ్ వైడ్ గా 7.12కోట్ల షేర్స్ ను జెర్సీ అందుకుంది.  నిన్న జెర్సీ సినిమాతో పాటు లారెన్స్ హర్రర్, కామెడీ నేపథ్యంలో వచ్చిన ‘కాంచన3’రిలీజ్ అయ్యింది.  కాకపోతే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకలేక పోయింది.  ఇదే జెర్సీకి బాగా కలిసి వచ్చింది.  జెర్సీ సినిమాకు వస్తోన్న పాజిటివ్ టాక్ వల్ల మిగతా సినిమాల కలెక్షన్స్ కి ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

ఏరియా వైజ్ జెర్సీ కలెక్షన్లు : 

నైజాం: రూ .1.97 కోట్లు
సీడెడ్: రూ 0.40  కోట్లు
వైజాగ్: రూ.
ఈస్ట్: రూ 0.42  కోట్లు
వెస్ట్: రూ. 0.29  కోట్లు
కృష్ణ: రూ 0.34  కోట్లు
గుంటూరు: రూ.
నెల్లూరు: రూ 0.17 కోట్లు
ఏపి, తెలంగాణ: రూ. .4.47 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 1.15  కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్: రూ 1.7  కోట్లు

ప్రపంచవ్యాప్తంగా: రూ. 7.32  కోట్లు


మరింత సమాచారం తెలుసుకోండి: