నాచురల్ స్టార్ నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వేసవి కానుకగా వచ్చిన ‘జెర్సీ’ సినిమా విడుదలైన ప్రతి చోట మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. తాజాగా ఈ సినిమా విజయం సాధించడంతో డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మారు మ్రోగిపోతోంది.ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది హీరోలు సినిమా చూసిన మరుక్షణం గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేయడానికి ఇష్టపడుతున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.

Image result for jersey nani

ఇదే క్రమంలో ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ డైరెక్టర్ కి ఫోన్ చేసినట్లు ఇద్దరం కలిసి పనిచేద్దామని చెప్పినట్లు ఫిల్మ్ నగర్ లో టాక్ వినపడుతోంది. గౌతమ్ తన మొదటి సినిమా 'మళ్ళీ రావా' తో మంచిపేరు తెచ్చుకున్నాడు కానీ ఇలాంటి ఇంపాక్ట్ అయితే లేదు.  

Image result for jersey nani allu arjun

ఈ సారి నాని స్టార్ పవర్ కూడా తోడు కావడంతో సినియా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. జెర్సీ సినిమాతో తానేంటో నిరూపించుకున్నాడు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. మొత్తం మీద జెర్సీ సినిమా మంచి విజయం తో సినిమా యూనిట్ మొత్తం మంచి ఆనందంలో మునిగితేలుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: