అక్కినేని వారసుడు నాగచైతన్య, అక్కినేని కోడలు సమంత పెళ్లి తర్వాత జంటగా కలిసి నటించిన తొలి సినిమా మజిలీ. ఈ శుక్రవారంతో రెండు వారాలు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 36. 14 కోట్ల‌ రూపాయల షేర్ కొల్లగొట్టింది. ఈ సమ్మర్ లో తొలి సూపర్ హిట్ సినిమాగా అంచనాలు అందుకున్నమ‌జిలీ తెలుగు రాష్ట్రాల్లో 28.50 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టింది. చైతు కెరీర్‌లోనే మజిలీ సోలోగా పెద్ద హిట్‌గా నిలిచింది. వ‌సూళ్ల ప‌రంగా కూడా రికార్డులు షేక్ చేస్తోన్న ఈ సినిమా చైతుకు బిగ్గెస్ట్ హిట్‌.

Related image

చైతు - సామ్ జంట పెళ్ల‌యిన త‌ర్వాత జంటగా న‌టించిన తొలి సినిమా కావ‌డంతో పాటు కంటెంట్ ఉండ‌డంతో క్లాస్ వ‌ర్గాల‌ను, యూఎస్ ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంది. తొలి వారంలోనే బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల భాట‌లోకి వ‌చ్చిన మ‌జిలీ రెండో వారంలో భారీగా లాభాలు చూసింది. ఇక రెండో వారంలో వ‌చ్చిన సాయిధ‌ర‌మ్ తేజ్ చిత్ర‌ల‌హ‌రి అంచ‌నాలు అందుకోలేక‌పోవ‌డం కూడా మ‌జిలీకి క‌లిసి వ‌చ్చింది. ఇక మూడో వారంలో నాని జెర్సీ సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. మ‌రి మూడో వారంలో జెర్సీని త‌ట్టుకుని మ‌జిలీ ఎలా బాక్సాఫీస్ జ‌ర్నీ చేస్తుందో ?  చూడాలి.
మ‌జిలీ రెండు వారాల ఏరియా వైజ్ వ‌సూళ్లు : (రూ.కోట్ల‌లో)

Related image

నైజాం –  12.31 
సీడెడ్ –  4.22  
ఉత్తరాంధ్ర –  4.27  
ఈస్ట్ – 1.66  
వెస్ట్ –  1.40  
గుంటూరు –  1.96  
కృష్ణా – 1.81  
నెల్లూరు – 0.83  


మరింత సమాచారం తెలుసుకోండి: