సమ్మర్ కానుకగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో విడుదలైన జెర్సీ సినిమా మంచి సక్సెస్ ఫుల్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లి పోతుంది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుండే మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో మరోపక్క వేసవి సెలవులు అయిన నేపథ్యంలో సినిమాకి యువత బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా చూసిన చాలా మంది ప్రముఖులు డైరెక్టర్పై సినిమా యూనిట్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Related image

తాజాగా జెసి సినిమా చూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన ట్విట్టర్ అకౌంట్ లో.. "జెర్సీ ఒక అద్భుతమైన చిత్రం..నన్ను పూర్తిగా మాయలో పడేసింది. గౌతమ్..  అలాంటి సబ్జెక్టును ఎంచుకున్నందుకు.. దాన్ని కన్విక్షన్ తోనూ నైపుణ్యంతోనూ తెరకెక్కించినందుకు హ్యాట్స్ ఆఫ్. గౌతమ్ విజన్ ను సపోర్ట్ చేస్తూ బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చినందుకు క్యాస్ట్ & క్రూ కు అభినందనలు.

Image result for jersey nani allu arjun

బ్రదర్ నాని.. నీ అద్భుతమైన నటనతో బాల్ ను స్టేడియం ఆవతలకి కొట్టావు. బ్రిలియంట్.. బ్రిలియంట్... బ్రిలియంట్. నాని.. నీ నటనను నేను చాలా కాలం మనసులో పెట్టుకుంటాను. నేను నిన్ను చూసి చాలా గర్విస్తున్నాను." అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తం మీద సినిమా మంచి సక్సెస్ సాధించడంతో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల మనసులను ఈ సినిమా దోచుకోవడం తో అంతేకాకుండా ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండుసార్లు చూసినట్లు విడుదలైన రోజు నాడే ఒకేసారి ఎన్టీఆర్ వంటి హీరో 'జెర్సీ' సినిమా రెండుసార్లు చూసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో కచ్చితంగా ఫుల్ టైం రన్నింగ్ లో ఈ సినిమా మంచి లాభాలు నిర్మాతకి తెచ్చి పెడుతుంది అంటున్నారు ట్రేడ్ వర్గాల వారు.



మరింత సమాచారం తెలుసుకోండి: