Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Mon, May 27, 2019 | Last Updated 6:37 pm IST

Menu &Sections

Search

జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి

జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
జెర్సీని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు : గౌతమ్ తిన్నూరి
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
నేచుర‌ల్ స్టార్ నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్ జంట‌గా, రోనిత్ క‌మ్ర‌, స‌త్య‌రాజ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో  సితార ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన చిత్రం `జెర్సీ`. ఏప్రిల్ 19న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌హిట్ టాక్‌తో స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి ఇంట‌ర్వ్యూ..`జెర్సీ` ఇన్‌స్పిరేష‌న్ ఎక్క‌డి నుండి వ‌చ్చింది?- నిజానికి ముందు నేను స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాల‌ని అనుకోలేదు.

హైద‌రాబాద్‌లో ఓ ప్రెస్‌మీట్‌లో హ‌ర్ష బోగ్లే మాట్లాడుతూ స‌చిన్ టెండూల్క‌ర్ ఎంత గొప్పోడో ఆరోజు చెప్పారు. స‌చిన్ అంత గొప్ప ఆట‌గాళ్లు చాలా మంది ఉన్నా కూడా స‌చిన్ ఆయ‌న అట్యిట్యూడ్ కార‌ణంగానే స‌చిన్ గొప్ప‌వాడైయ్యాడ‌ని.. హర్ష బోగ్లే చెప్పుకొచ్చారు. నాకు స‌చిన్ టెండూల్క‌ర్ గొప్ప‌త‌నం క‌న్నా.. ఆయ‌న‌లా టాలెంట్ ఉన్నోళ్లు చాలా మంది ఉన్నారు క‌దా! అనే పాయింట్ బాగా న‌చ్చింది. సాధార‌ణంగా మ‌నం స‌క్సెస్ అయినోళ్ల‌నే గుర్తుపెట్టుకుంటాం. కానీ అంతే క‌ష్ట‌ప‌డి వేర్వేరు కార‌ణాల‌తో ల‌క్ష్యాన్ని చేరుకోని వాళ్లు చాలా మంది ఉంటారు. వాళ్ల క‌థ చెప్పాల‌నుకున్న సంద‌ర్భంలో జెర్సీ క‌థ‌ను త‌యారు చేసుకున్నాను.

రామ‌న్ లాంబా ఇన్‌స్పిరేష‌న్‌తో ఈ క‌థ‌ను త‌యారు చేసుకున్నార‌ని వార్త‌లు వినిపించాయి?- లేదండి.. క్రికెట్ ఆడుతూ రామ‌న్ లాంబా గాయ‌ప‌డి చ‌నిపోయారు. అయితే సినిమా చూసిన వారికి రామ‌న్ లాంబా క‌థ‌కు, నా సినిమాకు లింక్ లేద‌ని అర్థ‌మ‌వుతుంది. క‌థ ప‌రంగా ఎలాంటి రీసెర్చ్ చేశారు?- రీసెర్చ్ అంటూ ప్ర‌త్యేకంగా ఏమీ చేయ‌లేదు. చిన్న‌ప్ప‌ట్నుంచి క్రికెట్ ఆడుతున్నాం క‌దా.. దాన్ని దృష్టిలో పెట్టుకునే క‌థ‌ను రాసుకున్నాను. క‌థ‌పై ఎక్కువ రోజులు వ‌ర్క్ చేశాను. నా తొలి చిత్రం `మ‌ళ్ళీరావా` కంటే ముందు నుండే నా ద‌గ్గ‌రున్న స్టోరి. సినిమాకు ఇంత పెద్ద రెస్పాన్స్ వ‌స్తుంద‌నుకున్నారా?- లేదండి.. ఇంత మంచి రెస్పాన్స్ వ‌స్తుంద‌ని అనుకోలేదు. ఎందుకంటే సినిమా అంటే ఓ బాధ్య‌త‌.

ముఖ్యంగా ద‌ర్శ‌కుడ్ని న‌మ్మే నిర్మాత డ‌బ్బులు పెడ‌తాడు. మొన్న‌టి వ‌ర‌కు నాకు కూడా అరే ఇంత మంది నన్ను న‌మ్మారే ఏమ‌వుతుందో ఏమో అనే టెన్ష‌న్ ఉండేది. ఇప్పుడు సినిమాకు హిట్ టాక్ వ‌చ్చి అంద‌ర‌రూ ఎంజాయ్ చేస్తున్నా స‌రే!  నేను ఎంజాయ్ చేయ‌డానికి నాకు ఇంకా స‌మ‌యం ప‌ట్టేలానే ఉంది. నా ద‌గ్గ‌రున్న స్క్రిప్ట్స్‌లో నాకు ఇదే ఇష్ట‌మైన స్క్రిప్ట్‌. క‌థ రాసుకున్న త‌ర్వాత రెండు, మూడేళ్లు నా ద‌గ్గ‌రే ఉంది. ఆ ప‌రిస్థితుల్లో ఎవ‌రూ నాతో ఇలాంటి  సినిమా చేయ‌ర‌ని ఎవ‌రినీ అప్రోచ్ కాలేదు. ఈ చిత్రం ద్వారా ఏం చెప్పాల‌నుకున్నారు?- ఓ అండ‌ర్‌డాగ్ స్టోరి.

ప్ర‌పంచ‌మంతా ఇత‌నేం చేయ‌లేడు అని అంద‌రూ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన  ఓ వ్య‌క్తి.. అత‌ను ఎలాంటి ప్ర‌య‌త్నం చేశాడు?  దాన్ని సాధించ‌డానికి అత‌ను ఎంత వ‌ర‌కు ముందుకెళ్లాడ‌నేదే క‌థ‌. నాని కాన్ఫిడెన్స్ లెవ‌ల్ ఎలా ఉండేది?- నానిగారి కాన్ఫిడెన్స్ చూసి చాలా సంద‌ర్భాల్లో భ‌య‌మేసింది. ఎందుకంటే నేను ఓ మంచి సినిమా చేయాల‌నే త‌ప‌న‌తో ఈ సినిమా చేస్తూ వ‌చ్చాను. ఔట్‌పుట్‌ను డ‌బ్బింగ్ థియేట‌ర్‌లో చూసుకున్న త‌ర్వాత ఇది మ‌నం చేసిన సినిమాయేనా అనిపించింది. క్రికెట్ స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ కోసం ఏం చేశారు?నాని, విశ్వాంత్ త‌ప్ప‌.. ఈ సినిమాలో మిగిలిన వాళ్లంద‌రూ క్రికెట‌ర్సే. క్రికెట‌ర్స్ అంద‌రికీ యాక్టింగ్‌లో కొన్ని రోజులు శిక్ష‌ణ ఇచ్చాం. స్పోర్ట్స్‌ను అథేంటిక్‌గా చూపించాలి.

క్రికెట్ స‌న్నివేశాల‌ను షూ్ చేయ‌డం చాలా క‌ష్టమైంది. సాధార‌ణ సీన్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసేయొచ్చు. అదే క్రికెట్‌లో 1 మినిట్ ఏపిసోడ్‌ను ఒక‌టిన్నర రోజు షూట్ చేసిన సంద‌ర్భం కూడా ఉంది. ఒక కెమెరాతో మూమెంట్స్ క్యాప్చ‌ర్ చేయ‌డం క‌ష్టం. అందుక‌నే ఓ సైడ్ క్రికెట్ గేమ్‌ను కొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం.. మ‌రో ప‌క్క స‌న్నివేశాల‌ను మ‌రికొన్ని రోజుల్లో చిత్రీక‌రించాం. బాలీవుడ్‌లో సినిమాలు చేస్తారా? . నేను బాలీవుడ్‌లో సినిమాలు చేయాల‌నే ఆలోచన ఇప్ప‌ట్లో లేదు. నెక్స్‌ట్ ప్రాజెక్ట్స్‌- ముందు క‌థ రాసుకున్న త‌ర్వాతే దానికి త‌గ్గ హీరోల‌ను క‌లిసి క‌థ చెబుతాను. ప్ర‌స్తుతం నా ద‌గ్గ‌ర కొన్ని క‌థ‌లున్నాయండీ.. అయితే వెంట‌నే సినిమా స్టార్ట్ చేయ‌ను. కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేస్తాను.


jersey-movie-director-gowtam-tinnanuri-natureal-st
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
జూన్ 21న విడుద‌ల‌వుతున్న ‘మ‌ల్లేశం’
రాజన్న బిడ్డ జగన్ కి శుభాకాంక్షలు తెలపాలా.. ఇదిగో వాట్సాప్ నెంబర్!
బిగ్ బ్రేకింగ్ : బాబోరి డేటాచోరి కేసు బాసే జగన్ ఇంటెలిజెన్స్ ఛీఫ్ ?
లగడపాటి దూల తీరబోతుందా ? పోలీస్ కేసు పెట్టిన లాయర్ మురళీకృష్ణ!
హమ్మ ‘ఓటర్’ ఓ కొలిక్కి వచ్చిందట!
జగన్ దయగల్ల మనిషి...ఆయన వల్లే బతికి ఉన్నా!
నాకు అంత గర్వం లేదు..తప్పుగా చూపించారు!
ప్రత్యేక హోదాపై జగన్ తాజా స్పందన ఇదీ!
ఫోటో ఫీచర్ : జనం మనవెంటే..విజయం మనవెంటే..!
ప్రత్యేక హోదానే ప్రధమ లక్ష్యం..నేడు మోదీతో జగన్ భేటి!
పాపం తాగుబోతు తండ్రి (బాబోరు) అప్పులు చేసి మైనర్ బిడ్డ (జగన్) మీద వేసి పోయినట్లు ఉందా ఆంధ్ర పరిస్ధితి ?
బావా నీకు కంగ్రాట్స్ : మహేష్
ఫోటో ఫీచర్ :  జగన్ ప్రభుత్వం గురించి గవర్నరు ఆఫీసు ఉత్తర్వులు
హాట్ లుక్ తో సమంత..ఏందీ ఛండాలం అంటున్న నెటిజన్లు!
వైసీపి పార్లమెంటరీ పక్షనేత ఎన్నికను జగన్ ఎందుకు వాయిదా వేసారో తెలుసా ?
‘దొరసాని’ప్రీలుక్ రిలీజ్ !
కేసీఆర్ తో జగన్ భేటీ...ఆంతర్యం అదేనా!
‘సీత టాక్ ఎలా ఉందంటే!
విపక్ష నేతగా చంద్రబాబు నో.మరి ఎవరు ?
ఆ ఒక్క జనసేన ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్?
ఫోటో ఫీచర్: బాబోరి రాజీనామా, గవర్నర్ ఆదేశాలు
అల్లాద్దీన్..అద్భుతం సృష్టించబోతుందా!
మెత్తగా మాట్లాడే సబ్బం హరీ మొత్తంగా సర్ధుకోవాల్సిందేనా?
జగన్ కి మోదీ శుభాకాంక్షలు!
హతవిధీ : జగన్ కి పెరిగిన మెజారిటీ అంత కూడా లేదు బాబోరి గెలుపు!
జగన్ ని అభినందించాలనుకుంటే..తిట్లు తింటున్నాడు!
అసెంబ్లీ, లోక్ సభ్ ఎన్నికల ఫలితాలు 2019 : లైవ్ అప్ డేట్స్
లక్ష ఓట్ల పైగా మెజారిటీతో దుమ్ము రేపుతున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి!
జగన్ కి శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశిస్సులు ఫలించాయా!
తెలంగాణలో తొలి ఫలితం వెల్లడి.. మెదక్‌లో కొత్త ప్రభాకర్ విజయం!
తలెక్కడ పెట్టుకోవాలో అర్థం అవుతుందా రాజగోపాల్!
బాబోరి రియల్ సత్తా..తెదేపా ఆల్ టైమ్ వరస్ట్ @ 19?
వైయస్ఆర్సీపీ ఘనవిజయం వెనక అత్యంత కీలకంగా వ్యవహరించింది వీరే!!
పరిటాల శ్రీరామ్ పాయే?
వైసీపీ @ 150
తెలంగాణ లో కేసీఆర్ ఎదురీత?
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.