పూనమ్ కౌర్ .. తన మీద ఫేక్ వీడియోస్ యూట్యూబ్ లో సర్క్యూలేట్ అవుతున్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 40 వరకూ ఆడియో క్లిప్స్ ను యూట్యూబ్ లో సర్క్యులేషన్ లో ఉన్నాయి.  ఇవి ఫేక్ ఆడియో క్లిప్స్ అని మాత్రం పూనమ్ చెప్పడంలేదు. అవి నకిలీవని అలా నకిలీ ఆడియో క్లిప్ లను తయారు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పూనమ్ కేసు పెట్టలేదు. 


తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఫోన్ కాల్స్ ను ఇలా బహిరంగపరచడం.. అది తనకు వేదన కలిగించడంపై మాత్రమే కేసు పెట్టింది.   ఇక ఈ కేసు పై సైబర్ క్రైమ్ అడిషనల్ డీసీపీ రఘువీర్ మాట్లాడుతూ.. ఫోన్ కాల్స్ ను ఎవరు లీక్ చేశారు.. ఎవరు ఆన్ లైన్ లో పెట్టారు అనే దిశగా విచారణ సాగుతోందని తెలిపారు. ఇలా అనుమతి లేకుండా వ్యక్తిగత కాల్స్ ను పబ్లిక్ చేయడం  సైబర్ నేరాల చట్టం లోనే సెక్షన్ 66C ప్రకారం సైబర్ హరాస్ మెంట్ కిందకు వస్తుందని..  ఎవరు లీక్ చేసి ఉండొచ్చనే విషయంలో ఇద్దరు అనుమానితుల గురించి పూనమ్ సమాచారం ఇచ్చిందని తెలిపారు.


మరో వైపు లీక్ కాల్స్ ను ఆన్ లైన్ లో పెట్టిన అప్లోడర్స్ కు సంబంధించి వివరాలు అందజేయాల్సిందిగా యూట్యూబ్ నిర్వాహకులను కోరామని త్వరలో ఆ సమాచారం తమకు అందుతుందని తెలిపారు. ఇక ఫోన్ కాల్స్ లో ఉండే కంటెంట్ గురించి.. అందులో ఉండే ఆరోపణల గురించి విచారణ జరపడం లేదని రఘువీర్ స్పష్టం చేశారు. అయితే ఫోన్ కాల్స్ లో ఉండే ఇన్ ఫర్మేషన్ మీద సంబంధిత వ్యక్తులు కనుక ఫిర్యాదు చేస్తే మాత్ర ఆ దిశగా కూడా విచారణ జరుపుతామని క్లారిటీ ఇచ్చారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: