ఛైల్డ్ ఆర్టిస్ట్ భరత్ అంటే.. గుర్తుకు రావడం కాస్త కష్టమేమో కానీ.. చిట్టినాయుడు అంటే చాలా ఈజీగా గుర్తుపట్టేస్తారు.. రెడీ సినిమాలో ఈ అల్లరి పిల్లాడు చేసిన అల్లరి అలాంటిది మరి.. ఆ ఒక్క సినిమాయే కాదు.. చాలా సినిమాల్లో హాస్యం పండించిన భరత్ ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు.


పిల్లాడి రేంజ్‌ నుంచి కుర్రాడుగా ఎదిగిపోయాడు. ఇటీవల వెన్నెల కిషోర్‌ తన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వార్తల్లోకి వచ్చాడు.. బొద్దుగా ముద్దుగా ఉన్న భరత్ ఇప్పుడు హీరోలా తయారయ్యాడు. చాలా స్లిమ్ అయ్యాడు. 

మరి ఇంతగా ఎలా లావు తగ్గావంటే.. అందరూ నేను సినిమాల కోసమే అలా బొద్దుగా మారానేమో అనుకుంటుంటారని.. కానీ అది నిజం కాదని అంటున్నాడు భరత్.  జలుబు వచ్చిందని డాక్టర్‌ దగ్గరికి వెళ్లినా... నువ్వెందుకు ఇంత లావుగా ఉన్నావు, వెంటనే తగ్గాలని చెప్పేవారట  ఎలాగైనా తగ్గాలని నిర్ణయించుకొని డాక్టర్లని సంప్రదించాడట.

ఉడకబెట్టిన కూరగాయలు, కాస్త అన్నమే తింటూ  కొన్నాళ్లు డైట్‌ మెయింటెయిన్‌ చేశాడట. అలా మొత్తానికి ముప్పై కేజీలు తగ్గాడట. ఇప్పుడు హీరో ఫ్రెండ్ తరహా క్యారెక్టర్స్ వేస్తున్నాడ భరత్. మొన్నటిదాకా మాస్టర్‌ భరత్‌  అని పిలిపించుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు ఫ్రెండ్‌ భరత్‌గా మారిపోయాడు. అల్లు శిరీష్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఏబీసీడీలో శిరీశ్ స్నేహితుడిగా అలరించబోతున్నాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: