‘మహర్షి’ మూవీ విడుదల తరువాత ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా మహేష్ అనీల్ రావిపూడి మూవీ ప్రాజెక్ట్ కు జూన్ నుండి డేట్స్ ఇచ్చాడు. ఈమూవీని చాలవేగంగా పూర్తిచేసి వచ్చేఏడాది సంక్రాంతి రేసుకు విడుదలచేయాలని వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈమూవీకి మహేష్ ఓకె చెప్పినప్పటికీ కొన్నిసందేహాలు మహేష్ మనసును కలవర పెడుతున్నట్లు టాక్. అనీల్ రావిపూడి ఇప్పటివరకు డీల్ చేసిన పెద్దహీరోలు రవితేజ వెంకటేష్ లు ఒకరేంజ్ హీరోలు మాత్రమే. 

వీరిద్దరి సినిమాలు ఎంత హిట్ అయినా ఇప్పటి వరకు వీరిద్దరూ 100 కోట్ల కలక్షన్స్ మార్క్ ను అందుకోలేకపోయారు. అయితే మహేష్ రేంజ్ వేరు. మహేష్ సినిమాలకు 100 కోట్లు కలక్షన్స్ దాటకపోతే ఆమూవీ హిట్ అయినా అది సక్సస్ గా ఇండస్ట్రీ వర్గాలు గుర్తించవు. దీనికి కారణం మహేష్ సినిమాలకు జరిగే మార్కెట్ వందకోట్ల స్థాయిని దాటిపోయి ఉంటుంది.  

అందువల్ల అనిల్ రావిపూడికి ఆరేంజ్ స్టామినా ఉందా అన్నసందేహాలు లోలోపల మహేష్ కు ఉన్నట్లు టాక్. దీనికితోడు ఈమూవీ లైన్ మహేష్ కు బాగా నచ్చినప్పటికీ ఈమూవీ ఫైనల్ స్క్రిప్ట్ ఇంకా అనీల్ రావిపూడి పూర్తిచేయలేదు అని గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం అనీల్ రావిపూడి షూటింగ్ చేస్తున్న సమయంలో తన స్క్రిప్ట్ లోని డైలాగులలో అప్పటికప్పుడు చాల మార్పులుచేర్పులు చేస్తాడు అన్నప్రచారం ఉంది. 

అయితే  మహేష్ కు ఇలాంటి పద్ధతులు నచ్చవనీ చివరి నిముషంలో స్క్రిప్ట్ విషయంలో వచ్చే మార్పులుచేర్పులు మహేష్ అంగీకరించడనీ అంటారు. దీనితో అనీల్ రావిపూడి మహేష్ కోసం తన పద్ధతి మార్చుకుంటాడ లేదంటే మహేష్ అనీల్ రావిపూడితో రాజీపడతాడా అనే విషయమై ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: