టాలీవుడ్ మెగా ఫ్యామిలీ కి సంబందించిన ఏ విషయమైనా ఇట్టే వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.  హీరో రాంచరణ్ సతీమణి ఉపాసన ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.  తన ఫ్యామిలీకి సంబంధించిన లేదా ఏదైన ప్రత్యేకమైన రోజుల గురించి ముఖ్యంగా పండుగలు, మహిళా దినోత్సవం సందర్భంగా ఏదో ఒక మెసేజ్ తో మీడియాలో హల్ చల్ చేస్తుంది.  తన భర్త ఎక్కడికైనా షూటింగ్ వెళితే అక్కడి లోకేషన్స్ షేర్ చేస్తుంది.  సోషల్ మీడియాలో ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన షూట్స్ తో సందడి చేస్తుంది.  అంతే కాదు ప్రకృతికి సంబంధించి, ఇతర సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటుంది.   

రామ్ చరణ్ భార్య ఉపాసన దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారం అందుకున్నారు. 'ఈ ఏటి మేటి పరోపకారి'గా ఉపాసనను ఎంపిక చేశారు. తన అపోలో ఫౌండేషన్ ద్వారా ఆమె అందిస్తున్న సామాజిక సేవలకు గుర్తింపుగా ఈ విశిష్ట పురస్కారం లభించింది. దాదాసాహెబ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ సంస్థ ఈ అవార్డు ప్రకటించింది.  అయితే ఈ అవార్డు సమాజంలో దీనావస్థలో ఉన్నవారిని ఆదుకున్నందుకు, విభిన్న రంగాల్లో  ప్రతిభావంతులకు, స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న వ్యక్తులను ఎంపిక చేసి ఈ అవార్డు అందిస్తున్నారు.

తాజాగా తనకు దాదాసాహెబ్ ఫాల్కే సామాజిక సేవా పురస్కారం లభించడంపై ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. "నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతిరోజు మంచి పనులు చేసేలా శుభసందేశాలు పంపించే సానుకూల దృక్పథం ఉన్న నా ప్రజలందరికీ ఈ అవార్డును అంకితం చేస్తున్నాను. నన్ను అన్నివిధాలా వెన్నంటి ఉండే నా ప్రియమైన కుటుంబానికి కృతజ్ఞతలు" అంటూ ఆమె ట్వీట్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: