కమెడియన్ సునీల్‌.. చిరంజీవిని ఎంతగా అభిమానిస్తారో తెలిసిన విషయమే.. అన్నయ్య అంటూ ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. అలాంటి చిరంజీవి ఓసారి సునీల్ ప్రాణాలు కాపాడారట. ఆయన ఓ మాట చెప్పి ఉండకపోతే.. ఈరోజు సునీల్ బతికి ఉండేవారే కాదట.

ఇంతకీ అసలేంజరిగిందంటే.. ఠాగూర్‌ సినిమా చేస్తున్న రోజులవి.. షూటింగ్‌ అయ్యాక.. అన్నయ్యా.. భీమవరం వెళ్లొస్తా అంటూ చిరంజీవికి చెప్పి బయల్దేరారట సునీల్. అప్పుడు చిరంజీవి సీటు బెల్ట్‌ పెట్టుకోవడం మర్చిపోవొద్దు అని గట్టిగా చెప్పారట. 

చిరంజీవి మాట కాదనలేక.. ఇష్టం లేకపోయినా సీటు బెల్డ్ పెట్టుకుని బయటలుదేరారట సునీల్. ఆ ప్రయాణంలో ప్రమాదం జరిగిందట. సునీల్  కారు నాలుగు పల్టీలు కొట్టిందట.  చిరంజీవి చెప్పినట్టు నేను సీటు బెల్టు పెట్టుకున్నాను కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఏమైపోయేవాడినో.. అంటూ ఆనాటి సంఘటనను సునీల్ గుర్తు చేసుకుంటున్నారు. 

అలా చిరంజీవి తన ప్రాణాలు కాపాడాడని చెప్పారు సునీల్. ఇదే కాదు.. సునీల్ జీవితంలో చాలాసార్లు ప్రమాదానికి గురయ్యాడట. కొన్నేళ్ల పాటు వరుసగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయట. సునీల్‌ చనిపోయాడు అంటూ అప్పట్లో కొన్ని టీవీ ఛానళ్లలో వార్తలు కూడా వచ్చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ప్రతి ఒక్కరూ హెల్మెట్ లేదా సీటు బెల్డ్ తప్పనిసరిగా పెట్టుకోవాలని అభిమానులకు విజ్ఞప్తి చేస్తున్నాడు సునీల్. 



మరింత సమాచారం తెలుసుకోండి: