‘జెర్సీ’ కి ఇండస్ట్రీ ప్రముఖుల ప్రశంసలు లభిస్తున్న నేపధ్యంలో సాధారణ ప్రేక్షకుడి నుండి ఇండస్ట్రీ సెలెబ్రెటీ వరకు ప్రస్తుతం అందరు ‘జెర్సీ’ గురించి మాట్లాడుతూ ఈమూవీ దర్శకుడు గౌతమ్ పై విపరీతమైన ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీని చూసిన జూనియర్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు అన్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి.

ప్రస్తుతం జూనియర్ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ లో చిక్కుకున్న నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ పూర్తి అయ్యేదాకా మరో మూవీకి సంబంధించి కనీసం కథను కూడ వినడానికి ఆసక్తీ కనపరచడం లేదు అన్న వార్తలు ఇప్పటికే వచ్చాయి. దర్శకుడు సురేంద్ర రెడ్డితో పాటు కొరటాల శివ కూడ తమ వద్ద జూనియర్ కు సరిపడే ఒక మంచి కథ ఉంది అని చెప్పినా కనీసం ఆకథను వినడానికి కూడ జూనియర్ ఆసక్తి కనపరచలేదు అని టాక్. 

అయితే ‘జెర్సీ’ మూవీని చూసిన తరువాత జూనియర్ దర్శకుడు గౌతమ్ ను తన వద్దకు పిలిపించుకుని ప్రత్యేకంగా అభినందించడమే కాకుండా అతడు చెప్పబోయే ఒక కథను వినడానికి అంగీకరించాడు అని వార్తలు వస్తున్నాయి. మాస్ సినిమాలతో పాటు ఒక ఉద్వేగపూరితమైన ఒక మూవీ ప్రాజెక్ట్ లో నటించాలి అని తారక్ అభిప్రాయం ఉన్న నేపధ్యంలో అతడు టాలెంట్ తగిన ఒక మంచి కథ గౌతమ్ వద్ద ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

ఇలాంటి పరిస్థుతులలో జూనియర్ వినబోతున్న ‘మజిలీ’ దర్శకుడు కథ పై అప్పుడే చాల అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ ఎప్పుడు పూర్తి అవుతుందో రాజమౌళికి కూడ తెలియని పరిస్థుతులలో గౌతమ్ జూనియర్ కోసం అంతకాలం వేచి ఉంటాడా లేదంటే ఈలోపునే ఎవరైనా మిడిల్ రేంజ్ హీరోతో ఈ దర్శకుడు సినిమాను చేసి తనకు వచ్చిన క్రేజ్ ను సద్వినియోగం చేసుకుంటాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.. 


మరింత సమాచారం తెలుసుకోండి: