జూనియర్ తన తాత రామారావు నామస్మరణ చేయకుండా ఫిలిం ఫంక్షన్స్ లో తన ఉపన్యాసం పూర్తి చేయడు. తాను జీవించి ఉన్నంతకాలం తన తాత తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాను అంటూ ఓపెన్ గా అనేకసార్లు చెప్పిన జూనియర్ తన తాత కోసం 'ఆటోలో' ప్రయాణం చేసిన ఒక ఆసక్తికర విషయాన్ని ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజులలో ఆయనకు వ్యక్తిగత డ్రైవర్ గా పనిచేసిన లక్ష్మణ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని వివరించాడు. 

ఎన్టీఆర్ అధికారం కోల్పోయి తన అబిడ్స్ ఇంటిలో ఏకాంతంగా గడుపుతున్నప్పుడు పండుగల సందర్భంలో జూనియర్ తల్లి షాలిని పిండివంటలు తయారు చేసి వాటిని క్యారేజీలో పెట్టి జూనియర్ కి ఇచ్చి పంపిన సంఘటనలను గుర్తుకు చేసుకున్నాడు లక్ష్మణ్. జూనియర్ తన తాత వద్దకు ఆ క్యారేజీ పట్టుకుని ఆటోలో వచ్చే వాడనీ జూనియర్ ను చూడగానే ఎన్టీఆర్ నవ్వుతు 'ఎం తాత ఏమి తెచ్చావ్' అని నవ్వుతూ అడగగానే జూనియర్ సిగ్గుపడిన సంఘటనలు తనకు గుర్తున్నాయి అంటూ అప్పటి విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. 

జూనియర్ తెచ్చి ఇచ్చిన ఆ క్యారేజ్ తీసుకున్నాక ఎన్టీఆర్ సాయంత్రం వరకు జూనియర్ ను తన వద్ద ఉంచుకుని తిరిగి సాయంత్రం తన కారులో ఎక్కించుకుని అప్పట్లో జూనియర్ తన తల్లితో కలిసి ఉండే శంకర్ మఠ్ ప్రాంతంలోని జూనియర్ ఇంటివద్ద రామారావు దింపేవారనీ అప్పటి విషయాలను చెపుతూ ఎన్టీఆర్ జూనియర్ ల సాన్నిహిత్యం పై అనేక ఆసక్తికర విషయాలను వివరించాడు. అప్పట్లో జూనియర్ తన తల్లితో ఒక చిన్న ఇంటిలో ఉన్న విషయం తనకు గుర్తు ఉంది అంటూ చెప్పుకువచ్చాడు లక్షణ్. 

ఒక సందర్భంలో రవీంద్రభారతిలో జూనియర్ డాన్స్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ డాన్స్ ప్రోగ్రామ్ కు ఎన్టీఆర్ తన మేకప్ మ్యాన్ ముత్తు తో మేకప్ చేయించడమే కాకుండా చివరి నిముషంలో ఆ డాన్స్ షోకు వచ్చి ఏంటీఆర్ కళ్ళకు ఐబ్రోస్ దిద్దుతూ ఎప్పటికైనా జూనియర్ తన ఖ్యాతిని కొనసాగించే మనవడు అవుతాడు అంటూ ఎన్టీఆర్ జూనియర్ ను ఆశీర్వదించిన విషయాలు తనకు ఇప్పటికీ గుర్తున్నాయి అని అంటున్నాడు లక్ష్మణ్. చిన్నతనంలో ఆటోలో ప్రయాణించిన జూనియర్ కు ఇప్పుడు కోట్లల్లో అత్యంత విలువైన కార్లు ఉన్నాయి అన్న విషయం గుర్తుకు వస్తే అదృష్టం ఒక మనిషి జీవితాన్ని ఎలా మలుపుతిప్పుతుందో అర్ధం అవుతుంది..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: