‘జెర్సీ’ పాజిటివ్ టాక్ తో తొలి వీకెండ్ ను పూర్తి చేసుకుంది. ఈమూవీ కలక్షన్స్ బాగానే  ఉన్నప్పటికీ ఈమూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ రేంజ్ లో లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ముఖ్యంగా ‘జెర్సీ’ కి ఓవర్సీస్ లో ఊహించని షాక్ తగిలింది అని వార్తలు వస్తున్నాయి.

ఈమూవీకి రేటింగ్స్ బాగా వచ్చినా నాని సినిమాల పట్ల ఓవర్సీస్ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ఉన్నా ఈమూవీ ఓవర్సీస్ కలక్షన్స్ ఇంకా ఒక మిలియన్ డాలర్లు క్రాస్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. వాస్తవానికి ఈమూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ ను పరిగణలోకి తీసుకుంటే ఈ సమయానికే ‘జెర్సీ’ ఓవర్సీస్ లో మిలియన్ డాలర్లు క్రాస్ చేసి ఉండాలి. 

అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాలలో కూడా ‘జెర్సీ’ కలక్షన్స్ ఆమూవీ టాక్ స్థాయిలో లేవు అని వార్తలు వస్తున్నాయి. ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న లారెన్స్ ‘కాంచన 3’ బిసి సెంటర్లలో దుమ్ము రేపుతుంటే ఆ స్థాయిలో ‘జెర్సీ’ బిసి సెంటర్లలో తన ప్రాభవాన్ని చూపెట్టలేక పోతోంది. దీనితో నాని కోరుకున్న బ్లాక్ బస్టర్ హిట్ ను ‘జెర్సీ’ అందించ లేదా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే ఈమూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడు వ్యక్తం చేస్తున్న టోటల్ పాజిటివ్ టాక్ తో ఈమూవీ కలక్షన్స్ మరింత బలపడతాయా లేకుంటే ఈ మొదటి సోమవారం కలక్షన్స్ పరీక్షలో ‘జెర్సీ’ చతికలపడుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈవారం ఈమూవీకి పోటీగా విడుదల అవుతున్న మరే పెద్ద సినిమాలు లేని నేపధ్యంలో ఈమూవీకి వచ్చిన పాజిటివ్ టాక్ ‘జెర్సీ’ ని రక్షించి ఈమూవీని 50 కోట్ల షేర్ మూవీగా మారుస్తుందో లేదో ఈవారంతానికి తేలిపోతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: