యావత్ ప్రపంచం ఉలిక్కి పడేలా నిన్న కొలంబోలో మారణహొమం జరిగింది.  కొలంబోపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈస్టర్ పండుగను పురస్కరించుకుని పేలుళ్లకు పాల్పడ్డారు. 160 మంది కన్నుమూశారు. ఎంతో మంది గాయపడ్డారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఉదయం 8.30గంటల ప్రాంతంలో మూడు   చర్చిలు, మూడు హోటల్లలో ఐసీస్ ఉగ్రవాదులు ఒక్కసారిగా బాంబులు పేల్చారు. 


కాగా,  శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది.సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్‌ను ఖాళీ చేశారు. 


ఇదే విషయాన్ని రాధిక ట్వీట్ చేశారు. జరిగిన ఘటనను తాను న్యూస్ ద్వారా తెలుసుకుని ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని తెలిపారు. ఇది చాలా బాధాకరమైన విషయమని రాధిక చెప్పారు. అయితే కొలంబోలో బాంబు దాడి జరిగిన చర్చికి తాను రెగ్యులర్‌గా వెళ్తానని అయితే, అనుకోకుండా చర్చికి వెళ్లకుండానే వెనుతిరిగినట్లు ఆమె తెలిపారు. ఇంత దారుణం చేసిన ఉగ్రవాదులు అంత మంది అమాయకుల ప్రాణాలు తీసి ఎం సాధించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: