టాలీవుడ్ లో ఆ మద్య వరుస విజయాలు అందుకుంటూ వస్తున్న హీరో నాని ‘కృష్ణార్జునయుద్దం’,‘దేవదాసు’సినిమాలతో ఫ్లాప్ అందుకున్నాడు. అసలే కొత్త హీరోలతో టాలీవుడ్ లో పోటీ ఏర్పడుతున్న సందర్భంలో వరుస అపజయాలు నానిని కుంగదీస్తున్న సమయంలో గౌత‌మ్ తిన్న‌నూరి దర్శకత్వంలో ‘జెర్సీ’సినిమా రూపొందింది.

ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని సెంటర్లలో పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది.  ఎమోషనల్ డ్రామాగా తీసిన ఈ సినిమాలో నాని నటనకు తెలుగు ప్రజలే కాదు..సినీ తారలు కూడా ఫిదా అయ్యారు.  సామ‌న్యుల‌తోపాటు సినీ ప్ర‌ముఖులు, విమ‌ర్శ‌కులు సినిమాపై, ద‌ర్శ‌కుడు గౌత‌మ్‌పై, నాని న‌ట‌న‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

ఇప్ప‌టికే ఎన్టీయార్‌, అల్లు అర్జున్ వంటి స్టార్లు `జెర్సీ`ని ప్ర‌శింసించారు.  ఈ సినిమాలో నాని ‘అర్జున్’ అనే పాత్రలో పూర్తిగా లీనమయ్యాడని...లవ్, ఎమెషన్, ఫాదర్ సెంటిమెంట్ అన్నీ సమ్మిళతం చేశారని..ఈ సినిమాలో ఎక్కడ ఏమాత్రం బోర్ లేకుండా దర్శకుడు గౌతమ్ తిన్నూరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారని అందరూ అంటున్నారు. 

తాజాగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కూడా `జెర్సీ`ని ప్ర‌శంసించారు. `హృద‌యాన్ని హ‌త్తుకునే సినిమా. అద్భుతంగా రాసిన‌, తీసిన సినిమా `జెర్సీ`. వెల్‌డ‌న్ గౌత‌మ్ తిన్న‌నూరి. ఈ సినిమా కోసం ప‌నిచేసిన అంద‌రూ గ‌ర్వప‌డ‌తారు. నాని `బాబు`.. జ‌స్ట్ ల‌వ్యూ అంతే` అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: