`జెర్సీ` లో నాని నటనకు విమర్శకుల నుంచి మాత్రమే కాకుండా ఇండస్ట్రీ ప్రముఖుల నుండి విపరీతమైన ప్రశంసలు వస్తున్నాయి.   ఇప్పటికే స్టార్ హీరోలు ఎన్టీఆర్  ర్ అల్లు అర్జున్ `జెర్సీ`ని ఆకాశానికి ఎత్తేశారు. దర్శకుడు రాజమౌళి కూడ నాని పై ప్రశంసలు కురిపించాడు. నటుడిగా నాని మరో అద్భుతమైన చిత్రాన్ని అందించాడని ప్రశంసలు కురిపిస్తూ అనేకమంది ట్విట్స్ పెడుతున్నారు. 

ఈ లిస్ట్ లో ఇప్పుడు లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ కూడ చేరిపోయాడు. అయితే విజయ్ నాని నటనను ప్రశంసిస్తూ చేసిన కామెంట్స్ మాత్రం అందరిని ఆకరిషిస్తున్నాయి. ఈమూవీలో క్రికెటర్ గా నటించిన నాని  క్రికెట్ గేమ్ ను ఆడిన తీరు అదేవిధంగా అతడు కొట్టిన షాట్స్ గురించి స్పందిస్తూ క్రికెటర్ అర్జున్ పాత్రలో నాని అందరిచేత క్లాప్స్ కొట్టించుకుని ఆపాత్రలో లీనమై నటించాడు అని పవిజయ్ ప్రశంసలు కురిపించాడు. 

అయితే ఈ సందర్భం లో 'ప్రేమతో ఒక గమనిక.. నాని హైదరాబాద్ సన్ రైజర్స్ టీమ్ కి ఆడొచ్చు. స్ట్రైకింగ్ అదరగొట్టేశాడు' అంటూ విజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. విజయ్ దేవరకొండ చేసిన ఈ ట్వీట్ ని 15 వేల మందికి పైగా రీట్వీట్ చేయగా 11 వేల మందికి పైగా లైక్ చేయడంతో నాని నటించిన అర్జున్ పాత్రతో ప్రేక్షకులు ఏవిధంగా కనెక్ట్ అయ్యారో అర్ధం అవుతుంది.  

అయితే నాని అభిమానులు మాత్రం విజయ్ చేసిన ట్విట్ పొగడ్త అనుకోవాలా లేదంటే సెటైర్ అనుకోవాలో అర్ధంకాక కన్ఫ్యూజ్ అవుతున్నట్లు టాక్.  ఇది ఇలా ఉండగా 'జెర్సీ' మూవీకి ఎవరూ ఊహించని విధంగా 'కాంచన 3' నుండి తీవ్ర పోటీ రావడంతో మళ్ళీ డబ్బింగ్ సినిమాల హవా టాలీవుడ్ లో మొదలైందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: