వచ్చేనెల 23వ తారీఖున వెల్లడి అయ్యే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలలో పవన్ కళ్యాణ్ కు ఎన్ని సీట్లు వస్తాయి అదేవిధంగా పవన్ 'జనసేన' కు పడ్డ ఓట్ల శాతం పై కేవలం పవన్ అభిమానులలో మాత్రమే కాకుండా రాజకీయ వర్గాలలో కూడ ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి అంటే పవన్ రేంజ్ అర్ధం అవుతుంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఎన్నికల ఫలితాల పై బెట్టింగ్ లు కాసే పందెం రాయుళ్లు కూడ 'జనసేన' కు ఏస్థాయిలో ఓట్లు పడ్డాయో తెలియక అయోమయంతో కొన్ని స్థానాల ఫలితాల ఫై కట్టిన బెట్టింగ్ లను కొందరు పందెం రాయుళ్లు క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు కూడ వార్తలు వస్తున్నాయి. 

ఇలాంటి రాజకీయ పరిస్థుతులలో పవన్ విజయవాడలోని 'జనసేన' కార్యాలయంలో ఎన్నికలలో పోటీ చేసిన 'జనసేన' అభ్యర్థులను తాను నిర్వహించే సమీక్ష సమావేశానికి ఆహ్వానించి గ్రౌండ్ లెవల్ అసలు ఏమి జరిగింది అన్న విషయం తెలుసుకుందామని సుమారు 200 వందల మంది 'జనసేన' నాయకులను పిలిస్తే కేవలం 20 మంది మాత్రయే హాజరైనట్లు వార్తలు రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఒకవైపు కొన్ని ప్రముఖ మీడియా సంస్థలు ఎన్నికల తరువాత నిర్వహించిన సర్వేలలో 'జనాసేన కు 10నుండి 15 శాతం వరకు ఓట్లు పడ్డాయి అని విశ్లేషణలు చేస్తున్న విషయాలు తెలిసినవే. అయితే పవన్ ఎన్నికల తరువాత నిర్వహించిన ఈసమీక్షా సమావేశానికి కేవలం 20 మాత్రమే వచ్చారు అంటూ కొందరు పవన్ వ్యతిరేకులు ప్రచారం చేయడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది.    

ఇది ఈవిధంగా ఉంటే పవన్ కు ఈ ఎన్నికలలో సీట్లు తక్కువ వచ్చినా ఓట్లు తక్కువ వచ్చినా ఆ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా పవన్ తిరిగి భారతీయ జనతా పార్టీ సానుభూతి పరుడుగా మార్చే విధంగా చాలా పెద్ద స్థాయిలో బీజేపీ తో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తున్న ఒక ప్రముఖ వ్యక్తి తిరిగి పవన్ ను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. దీనితో ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా పవన్ రాజకీయాలు ఎన్నికల తరువాత కూడ కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: