యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా 2011లో వచ్చి సక్సెస్ అందుకున్న సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. దశరథ్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించారు. ప్రభాస్ సరసన కాజల్, తాప్సి హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాను తన నవల నా మనసు కోరింది నిన్నే నుండి కాపీ కొట్టారని రచయిత్రి శ్యామలా దేవి కోర్ట్ లో కేసు వేశారు. 2019 లో కోర్ట్ ఆదేశాల మేరకు 4117/2018గా చార్జ్ షీట్ సిద్ధం చేసి దిల్ రాజుకి సమన్లు పంపించారు. 


అయితే కోర్ట్ లో నలుగుతున్న ఈ కేసు ఫైనల్ జడ్జ్ మెంట్ వచ్చింది. విచారణ అనంతరం మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా శ్యామలా దేవి నా మనసు కోరింది నిన్నే నవల ఆధారంగా తీసిన సినిమానే అంటూ హైదరాబాద్ సివిల్ కోర్ట్ నిర్ధారించింది. తన నవల కాపీ వివాదంపై కొన్నాళ్లుగా న్యాయపోరాటం చేస్తున్న శ్యామలా దేవికి సపోర్ట్ గా ఫలితం వచ్చింది.


2011 లో మిస్టర్ పర్ఫెక్ట్ రిలీజైనా తాను 2013లో టివిలో చూశానని.. అప్పటివరకు తన నవల కాపీ కొట్టారన్న విషయం తెలియదని అన్నారు శ్యామలా దేవి. మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ఉన్న ప్రతి పాత్ర తను నవలలో రాసుకున్నదే అని.. దిల్ రాజుకి ఈ విషయం చెప్పేందుకు ప్రయత్నించినా తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. 2009లోనే వారి కథ రిజిస్టర్ చేయించారని తప్పుడు ఆధారాలు చూపించారని వాపోయారు.


సినిమా మొత్తంలో 30 సీన్లు మక్కీకి మక్కీ దించారని.. ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ చేశారని తనకు నష్టపరిహారం ఇవ్వాల్సిందే అన్నారు శ్యామలా దేవి. మరి ఈ కేసు విషయమై దిల్ రాజు, డైరక్టర్ దశరథ్ ఎలా స్పందిస్తారో చూడాలి. కోర్ట్ తీర్పు ఇచ్చింది కాబట్టి ఆమెతో మాట్లాడి మ్యాటర్ సెటిల్ చేసుకుంటే బెటర్ లేదంటే మరింత ఇబ్బంది పడాల్సి వస్తంది.



మరింత సమాచారం తెలుసుకోండి: