బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తేజ డైరక్షన్ లో వస్తున్న సినిమా సీత. బెల్లంకొండ సురేష్ తనయుడిగా అల్లుడు శీను సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్ సీత సినిమా అసలైతే ఏప్రిల్ 25న రిలీజ్ ఫిక్స్ చేశారు. కాని సినిమాపై బజ్ ఏమి లేకపోవడం.. బిజినెస్ కూడా పూర్తి కాకపోవడంతో సీత రిలీజ్ వాయిదా వేయాలని చూస్తున్నారట.    


నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చిన తేజ బెల్లంకొండ బాబుతో తీసిన సీత పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ ఈ వారం ఉంటుందా లేదా అన్నది కన్ ఫ్యూజ్ గానే ఉంది. ఓ పక్క సినిమా 18 కోట్ల బిజినెస్ చేసిందని అయితే ఏప్రిల్ 25 రిలీజ్ మాత్రం కష్టమే అంటున్నారు. 


శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆరెక్స్ 100 బ్యూటీ పాయల్ రాజ్ పుత్ స్పెషల్ సాంగ్ లో నర్తించింది. ఈమధ్యనే రిలీజైన అమ్మడి ఐటం సాంగ్ ప్రోమో సినిమాపై క్రేజ్ వచ్చేలా చేసింది. ఏప్రిల్ 25 నుండి మే 17కి సీత వాయిదా పడ్డదని తెలుస్తుంది. 


ఈమధ్య రిలీజైన సినిమా టీజర్ సినిమాపై ఆసక్తి పెంచింది. నిర్మాత కొడుకుగా భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నా ఇప్పటివరకు కమర్షియల్ హిట్టు మాత్రం కొట్టలేని బెల్లంకొండ శ్రీనివాస్ సీత తో అయినా హిట్టు కొడతాడో లేదో చూడాలి. ప్రస్తుతం థియేటర్ లో సందడి చేస్తున్న మజిలీ, చిత్రలహరి, జెర్సీ 3 సినిమాలు సక్సెస్ అవగా తేజ సీత సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: