రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కొడుకు రాజమౌళి నిరంకుశత్వం పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసాడు. రాజమౌళి విజయాల వెనుక తమకుటుంబ సహకారం గురించి వివరిస్తూ తమ తండ్రి కొడుకుల అనుబంధం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను లీక్ చేసాడు.

రాజమౌళి ఈ స్థాయిలో టాప్ డైరక్టర్ అవుతాడని తాను కలలో కూడ ఊహించుకోలేదు అంటూ తామిద్దరం ఇంట్లో ఇప్పటి మోడ్రన్ తండ్రి కొడుకులులా స్నేహితులా ఉండమనీ పాతకాలపు తండ్రి కొడుకులులా ప్రవర్తిస్తామనీ తన ఇంటిలో తనదే ఆధిపత్యం అని చెపుతూ తన మాటను ఎంత గొప్పవాడైనా రాజమౌళి విని తీరవలసిందే అంటూ కామెంట్స్ చేసాడు.

రాజమౌళికి కథను అద్భుతంగా చెప్పే టెక్నిక్ తన వద్ద నుండి నేర్చుకున్నాడనీ ఆ నైపుణ్యంతోనే బహుశా రాజమౌళి టాప్ డైరెక్టర్ గా ఎదిగి ఉంటాడు అన్న తన అభిప్రాయాన్ని వెల్లడించాడు విజయేంద్ర ప్రసాద్. ఇక సినిమా కథ విషయంలో తమ ఇద్దరి మధ్య అనేకసార్లు భేదాభిప్రాయాలు వస్తాయనీ అయితే తాను చెప్పే సూచనలకు ఇంటిలో అంగీకరించినట్లు నటించే రాజమౌళి సినిమా షూటింగ్ సమయంలో తాను ఏమనుకున్నాడో అదేవిధంగా చాల నిరంకుసత్వంగా తన మాటలను కూడ లెక్క చేయకుండా తాను అనుకున్నది తీస్తాడు అంటూ షూటింగ్ స్పాట్ లో రాజమౌళి తనను తండ్రిలా కాకుండా కేవలం ఒక రచయితగా మాత్రమే చూస్తాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. 

ఇదే సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రచయితగా రాణించిన తాను దర్శకుడుగా రాణించాలని ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తాను ఇంకా దర్శకుడుగా సక్సస్ అవ్వకపోవడం తనకు బాధను కలిగిస్తోంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. అయితే తాను ఎప్పటికైనా ఒక భారీ సినిమాను తీసి రాజమౌళి స్థాయిలో హిట్ అందుకోవాలని తన డ్రీమ్ అంటూ కొడుకుగా రాజమౌళిని చూసి గర్వించినా అతడితో పోటీ పడుతూ అతడి స్థాయిని మించిన అత్యంత భారీ సినిమా తీయడం తనకల అంటూ విజయంద్ర ప్రసాద్ తన తీరని కోర్కెను బయటపెట్టాడు..  


మరింత సమాచారం తెలుసుకోండి: