ఒక సినిమా 20 వేల కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తుంది అంటే ఎవరు నమ్మలేని విషయం. అయితే ఈ శుక్రు వారం విడుదల కాబోతున్న హాలీవుడ్ మూవీ ‘ఎవెంజర్స్ ది ఎండ్ గేమ్’ కు 3 బిలియన్ డాలర్లు కలక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా వస్తాయని వినిపిస్తున్న అంచనాలు అత్యంత ఆశ్చర్యకరంగా మారాయి.

రాజమౌళి ‘బాహుబలి’ మూవీ టిక్కెట్లకు ఏర్పడిన క్రేజ్ కంటే రెట్టింపు స్థాయిలో ఈమూవీ టిక్కెట్లకు మన తెలుగు రాష్ట్రాలలో కూడ అత్యంత భారీ క్రేజ్ ఏర్పడటం ఆశ్చర్యంగా మారింది. వాస్తవానికి ఈసినిమా పై అంచనాలు ఉన్నా అడ్వాన్స్ బుకింగ్ లో ఈమూవీ టిక్కెట్లకు ‘బాహుబలి’ టిక్కెట్ల స్థాయికి మించి డిమాండ్ ఏర్పడటం ఎవరికీ అర్ధంకాని విషయంగా మారింది. 

అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ పవన్ కళ్యాణ్ మహేష్ బాబుల సినిమాల స్థాయిలో ఈమూవీకి ఏర్పడ్డ క్రేజ్ తో ఈమూవీకి సంబంధించి తొలి వారాంతానికి మల్టీప్లెక్సుల్లో ఎక్కడా టికెట్లు దొరకకపోవడమే కాకుండా వీకెండ్ తరువాత వచ్చే సోమవారం షోల టిక్కెట్లు కూడ పూర్తిగా అమ్మకం అయిపోవడం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలను షాక్ చేస్తోంది. ఇండియాలో ఈమూవీ వందల కోట్ల వసూళ్లు చేయడం ఖాయం అని అంటున్నారు.

ఇప్పుడు ఈ మ్యానియా నానీ ‘జెర్సీ’ కి అనుకోని దెబ్బ అని అంటున్నారు. ఇప్పటికే ఈసినిమా కలక్షన్స్ కు ‘కాంచన 3’ ఊహించని షాక్ ఇస్తే ఈవారంలో రాబోతున్న ఈ హాలీవుడ్ మూవీ మ్యానియా ‘జెర్సీ’ ని మరింత దెబ్బ కొడుతుంది అని అంచనాలు వస్తున్నాయి. నానీ ‘జెర్సీ’ కి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చినా ఇలా పరభాషా సినిమాల మ్యానియా ‘జెర్సీ’ కి శాపంగా మారుతుందనీ నానికి కలలో కూడ ఊహకందని విషయంగా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: