క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కు గత సంవత్సర కాలంగా కాలం ఏమాత్రం కలిసిరావడం లేదు. ‘రంగస్థలం’ లాంటి భారీ హిట్ ఇచ్చిన సుకుమార్ తో సినిమాలు చేయడానికి టాప్ హీరోలు ఇష్టపడుతున్నా అతడు చెప్పే కథలు నచ్చలేదు అంటూ టాప్ హీరోలు అతడిని వెయిటింగ్ లో పెట్టడం సుకుమార్ కు చెప్పుకోలేని అవమానంగా మారింది.

ఇలాంటి పరిస్థుతులలో సుకుమార్ బన్నీల మూవీ ప్రకటింప బడినా ఆసినిమా ఎప్పుడు ప్రారంభం అవుతుందో వారిద్దరికీ కూడ తెలియని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో సుకుమార్ ను ఆదుకోవడానికి దేవిశ్రీప్రసాద్ రంగంలోకి దిగుతున్నాడు. దేవిశ్రీని హీరోగా చేసి సినిమా తీయాలని ఆలోచనలు చేస్తున్న సుకుమార్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ గా మారబోతున్నట్లు టాక్.

తెలుస్తున్న సమాచారం మేరకు సుకుమార్ సృష్టించిన ఒక కథలో దేవిశ్రీప్రసాద్ హీరోగా మారబోతున్నాడు. ఈసినిమాను సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తోంది. ఈసినిమాకు దర్శకత్వం వహించేది పేరుకు సుకుమార్ సహాయకుడు అయిన ఒక యంగ్ డైరెక్టర్ అయినప్పటికీ కర్త కర్మ క్రియగా ఈ ప్రాజెక్ట్ విషయంలో అన్నింటా తానై సుకుమార్ వ్యవహరించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. 

ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ లేటెస్ట్ గా అందిస్తున్న పాటల ట్యూన్స్ కు ఆదరణ బాగా తగ్గుతున్న నేపధ్యంలో సాహసంతో దేవిశ్రీ సుకుమార్ సహాయంతో ఇలా హీరోగా మారడానికి తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దేవిశ్రీ వయస్సు ఇప్పటికే 35 సంవత్సరాలు దాటిన పరిస్థుతులలో ఈ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ను తెలుగు ప్రేక్షకులు ఎంత వరకు ఆదరిస్తారు అన్నది ప్రస్తుతానికి ఊహకందని ప్రశ్న.. 



మరింత సమాచారం తెలుసుకోండి: