ఈసమ్మర్ రేస్ లో టాప్ హీరోలకు సంబంధించి రాబోతున్న మూవీ ఒక్క ‘మహర్షి’ మాత్రమే. ఈసినిమాకు కలక్షన్స్ సునామీ వస్తుందనీ అత్యంత భారీస్థాయిలో బిజినెస్ జరిగింది. అయితే ఈమూవీకి సంబంధించిన పాటలు వరసపెట్టి విడుదల అవుతూ ఈమూవీ పై అంచనాలు పూర్తిగా తగ్గించి వేస్తున్నాయి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి 'ఛోటీ ఛోటీ బాతే' 'నువ్వే సమస్తం'  పాటలు విడుదల అయితే 'ఎవరెస్ట్ అంచున' అంటూ సాగే వీడియో సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. 

అయితే ఈమూడు పాటలకు కూడ చెప్పుకోతగ్గ స్థాయిలో స్పందన రాకపోవడంతో ‘మహర్షి’ పరిస్థితి ఏమిటి అంటూ సందేహాలు మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాకు సంబంధించి మరొక పాట విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసారు.  "పదరా పదరా పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా ఈ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా" అంటూ స్ఫూర్తి కలిగిలించే పాటను రేపు సాయంత్రం 4.05 లకు విడుదల చేయబోతున్నారు. 

మహేష్ బాబు ఒక పొలంలో పలుగు.. పార.. నాగలి చేత పట్టి నాగలి చేతబట్టిన రైతులకు ముందు నిలబడి కదం తొక్కుతున్నట్లుగా డిజైన్ చేయబడ్డ పోస్టర్ ను విడుదల చేసారు. పైర్ల పచ్చదానికి సింబల్ అన్నట్టుగా ఆకుపచ్చ రంగు చొక్కా వేసుకొని ప్యాంటును పైకి మడిచి తలకు టవలును తలపాగా లాగా కట్టి మోడరన్ రైతుగా అమెరికా నుంచి వచ్చిన లక్షల కోట్ల అధిపతి మహేష్ పాత్ర కనిపించబోతోంది. అయితే ఈరైతు లుక్ ను ముఖ్యంగా మహేష్ తలపాగాను చూస్తే ఎవరికైనా వెంటనే ‘భరత్ అనే నేను’ మూవీలో ఒక పాటలోని మహేష్ తలపాగా గుర్తుకు వస్తుంది. 

ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి విడుదలైన మూడు పాటలు ఫెయిల్ అయిన నేపధ్యంలో ఈపాట ట్యూన్ అందరికీ ఖచ్చితంగా నచ్చితీరాలి. ఇప్పటికే ఈసినిమాకు సంబంధించి ఎడిటింగ్ టేబుల్ నుండి వస్తున్న లీకుల ప్రకారం ఈమూవీ సక్సస్ పై అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపధ్యంలో ఈమూవీ పాటలు ఇలా వరసపెట్టి ట్యూన్స్ విషయంలో ఫెయిల్ అవుతున్న పర్సిస్తుతులలో ఈమూవీ ఈసమ్మర్ రేసుకు వచ్చే భారీ ఫెయిల్యూర్ గా మారి మహేష్ కు ‘బ్రహ్మోత్సవం’ జ్ఞాపకాలను తిరిగి గుర్తుకు చేస్తుందా అంటూ వస్తున్న గాసిప్పులతో ఈమూవీ బయ్యర్లు మాత్రమే కాకుండా మహేష్ అభిమానులు కూడ తీవ్రంగా టెన్షన్ పడుతున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: