డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా మహర్షి సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల అవటానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా మహేష్ కెరీర్లో 25వ సినిమా అయిన నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు మహేష్ అభిమానులు. ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన కొన్ని పాటలను ఇటీవల విడుదల చేశారు సినిమా యూనిట్.

Image result for maharshi

విడుదలైన పాటలు బట్టి మరియు టీజర్ బట్టి చూస్తుంటే మహర్షి సినిమా లో శ్రీమంతుడు ఫ్లవర్ తగులుతుందని అంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు... మరియు పాటలు టీజర్ చూసిన వారు. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ బాబు రైతుల సమస్యలపై పోరాడే కుర్రాడిగా ఉంటారని ఫిలింనగర్ టాక్. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో మహేష్ బాబు ఒక పొలంలో పలుగు.. పార.. నాగలి చేత నాగలి చేతబట్టిన రైతులకు ముందు నిలబడి కదం తొక్కుతున్నాడు.  

Image result for maharshi

పైర్ల పచ్చదానికి సింబల్ అన్నట్టుగా ఆకుపచ్చ రంగు చొక్కా వేసుకొని.. ప్యాంటు ను పైకి మడిచి.. తలకు టవలును తలపాగా లాగా కట్టిమరీ మోడరన్ రైతులా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ పక్కన అల్లరి నరేష్ ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వేసవి కానుకగా మరికొద్ది రోజుల్లో ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: