సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్ లో మొదటి సారిగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘దర్భార్’ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యింది.  ఈ చిత్రం లో చాలా కాలం తర్వాత రజినీకాంత్ ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారట. ఈ చిత్రంలో డబుల్ రోల్ లో కనిపించబోతున్నారట రజినీకాంత్.  మరో పాత్రలో సామాజిక కార్యదర్శిగా కనిపించబోతున్నారట. 

ఈ చిత్రంలో దక్షణినాధి స్టార్ హీరో నయనతార, మహానటి  ఫేమ్ కీర్తి సురేష్ లు నటిస్తున్నారు.  తాజాగా ఈ రోజు  చిత్ర షూటింగ్‌లో న‌య‌న జాయిన్ అయింది. రజనీ .. నయన్ కాంబినేషన్‌లోని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట.

రజనీ .. మురుగదాస్ కాంబినేషన్‌లో తొలిసారిగా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు మాఫియా డాన్ గా చూస్తూ వస్తన్న రజినీ పోలీస్ ఆఫీసర్ గా ఏ రేంజ్ లో మాస్ ఆడియన్స్ ని మెప్పిస్తారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: