‘ఛలో’మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది కన్నడ బ్యూటీ రష్మిక.  ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన ‘గీతాగోవిందం’సినిమాతో సూపర్ హిట్ అందుకుంది.  ఈ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు చేయడంతో... విజయ్ తో పాటు రష్మికకు మంచి పేరు వచ్చింది.  అప్పటి నుంచి టాలీవుడ్ లో రష్మికి గోల్డెన్ లెగ్ గా పేరు వచ్చింది.  నాగార్జున, నాని నటించిన ‘దేవదాసు’సినిమాలో నటించిన రష్మికకు పెద్దగా పేరు రాలేదు.

ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటిస్తుంది రష్మిక. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ నెక్స్ట్ అఖిల్ తో ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు కానీ నిర్మాత బన్నీ వాసు మాత్రం ఈ కాంబినేషన్ పై రోజు చర్చలు జరుపుతున్నాడు. ఇక రీసెంట్ గా కథ పూర్తిగా సెట్ అవ్వడంతో త్వరలో సినిమాను స్టార్ట్ చేయాలనీ ప్రయత్నాలు జరుపుతున్నట్లు సమాచారం.

దీనితో పాటు రష్మిక,  నితిన్ సినిమాలోనూ నటిస్తోంది. అంతేకాదు, టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన మహేష్ బాబు సినిమాలో కూడా హీరోయిన్ గా సెట్ అయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా చేయబోతున్న కొత్త చిత్రంలో రష్మికను హీరోయిన్ గా తీసుకున్నారు.

వరుస హిట్స్ తో ప్లాప్ లో ఉన్న హీరోలకు లక్ష్మి దేవిలా మారిన అమ్మడు ఇప్పుడు అఖిల్ కి కూడా అదే తరహాలో హెల్ప్ అవుతుందని నిర్మాత ఆమెను ఫైనల్ చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. సొంత బాషా కన్నడ సినిమాలతో బిజీగా ఉన్న బేబీ డియర్ కామ్రేడ్ సినిమాతో త్వరలోనే మూడు భాషలవారిని పలకరించనుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: