మహేష్ అనీల్ రావిపూడిల మూవీ ఫైనల్ కావడంతో ఈమూవీకి సంబంధించిన వార్తలు ఒకొక్కటిగా ఇప్పుడు లీక్ అవుతున్నాయి. ఈసినిమాకు సంబంధించి మహేష్ ఈమూవీ దర్శకుడుకి పెట్టిన కండిషన్స్ ప్రస్తుతం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసినిమాకు మహేష్ ఎటువంటి పారితోషికం తీసుకోడు. అదేవిధంగా ఈమూవీని 50 కోట్ల బడ్జెట్ తో ఖచ్చితంగా పూర్తిచేయాలి. అదేవిధంగా ఈమూవీని ఆరు నెలలలోపు పూర్తిచేసి తీరాలి. ఈ విషయాలు అన్నీ మహేష్ ఒక కార్పోరేట్ ఎగ్రిమెంట్ లా ఈమూవీ దర్శక నిర్మాతలతో రాసుకున్నట్లు టాక్. 

ఈసినిమాకు సంబంధించి రైట్స్ ను బయ్యర్లకు అమ్మే విషయంలో ఈమూవీ నిర్మాతకు పూర్తి స్వేచ్చ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనితో ఈమూవీ రైట్స్ ను ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ నిర్మాత 90 నుండి 100 కోట్ల స్థాయిలో అమ్మే ఆస్కారం ఉంది అని అంటున్నారు. అయితే ఈసినిమాకు సంబంధించి శాటిలైట్ రైట్స్ హిందీ డబ్బింగ్ రైట్స్ డిజిటల్ రైట్స్ మీద పూర్తి హక్కులు మహేష్ భార్య నమ్రతకు ఇచ్చే విధంగా ఎగ్రిమెంట్ రాసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

దీని ప్రకారం లెక్క వేసుకుంటే మహేష్ కు కనీసం ఈ శాటిలైట్ డబ్బింగ్ డిజిటల్ రైట్స్ ద్వారా 40 కోట్లు ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనికితోడు నమ్రతకు బాలీవుడ్ ఇండస్ట్రీతో అదేవిధంగా కార్పోరేట్ సంస్థలతో ఉన్న పరిచయం రీత్యా మహేష్ కు మరింత ఎక్కువ ఆదాయం వచ్చినా ఆశ్చర్యం లేదు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఇలాంటి ఎగ్రిమెంట్స్ తాము నటించే సినిమాలకు సంబంధించి సల్మాన్ ఖాన్ అమీర్ ఖాన్ లున్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మహేష్ కూడ ఈ ఎగ్రిమెంట్ తో ఆ బాలీవుడ్ టాప్ హీరోల స్థాయిలో చేరినట్లే అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: