ఎఫ్ 2  సినిమా విజయంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కమర్షియల్ డైరెక్టర్ అయిపోయాడు అనిల్ రావిపూడి. ఈ సినిమా విజయంతో చాలామంది స్టార్ హీరోలు అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి తెగ ప్రయత్నాలు చేశారు. వీరందరిలో ముందు మహేష్ బాబు ఎఫ్ 2  సినిమా షూటింగ్ సమయంలోనే తన దగ్గరకు అనిల్ రావిపూడి ని పిలిపించుకొని స్టోరీని సిద్ధం చేయమని అవకాశం ఇచ్చాడు.

Image result for mahesh anilravipudi

దీంతో అనిల్ రావిపూడి మహేష్ కి స్టోరీ సిద్ధం చేయడం కోసం వైజాగ్ లో దాదాపు పది రోజుల పాటు కూర్చుని ఒక మంచి మాసాల కథని సిద్ధం చేసి రెడీ గా ఉంచాడు. అయితే ఇన్ని జరిగినా గాని సినిమాపై సరైన క్లారిటీ ఇవ్వలేదు ఇద్దరు. ఇప్పటికే ఈ సినిమా మొదలవుతుందని మహేష్ అభిమానులు అనుకున్నారు..కానీ మహేష్ బాబు మాత్రం అనిల్ రావిపూడి చెప్పిన స్టోరీ పై కొంత డౌట్ గా ఉన్నట్లు ఫిలింనగర్ టాక్.

Image result for mahesh anilravipudi

ఇదే క్రమంలో తన 25వ సినిమా అయిన మహర్షి సినిమా రిజల్ట్ బట్టి అనిల్ రావిపూడి తో సినిమా చేయాలా వద్దా అనేది మహేష్ బాబు డిసైడ్ చేసుకున్నట్లు...దీంతో స్టోరీ రెడీ చేసుకుని తన దగ్గర పెట్టుకొని ఉన్న అనిల్ రావిపూడి తో మహేష్ వెయిట్ చేయమని తెలిపినట్లు ఇండస్ట్రీ టాక్. అయితే మరోపక్క ఈ చిన్న గ్యాప్ లో   ఎఫ్ 2 సినిమా విజయం తరువాత వెంటనే ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట అనిల్ రావిపూడి.



మరింత సమాచారం తెలుసుకోండి: