కోలీవుడ్ ఇండస్ట్రీలో రజనీకాంత్ క్రేజ్ గురించి పెద్దగా చెప్పనవసరం లేదు. ఆయన నటించిన సినిమాలు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడతాయి. కేవలం తెరమీద రజినీకాంత్ కనబడితే చాలు అన్నట్లుగా రజనీకాంత్ అభిమానులు ఉంటారు. అయితే ఇదిలావుండగా తాజాగా లారెన్స్ నటించిన కాంచన త్రీ సినిమా వేసవి కానుకగా ఇటీవల విడుదలైన విషయం మనకందరికీ తెలిసినదే.

Image result for kanchana 3 movie

అయితే సినిమా రిలీజ్ అయిన వెంటనే మొదటి షో నుండే నెగిటివ్ టాక్ సొంతం చేసుకున్న బీభత్సమైన కలెక్షన్లు లారెన్స్ సినిమా రాబట్టడం అది కూడా ఫ్లాప్ సినిమాకి కలెక్షన్లు రావడం ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ అయింది. కేవలం ఇటువంటి కలెక్షన్లు రజనీకాంత్ సినిమా కి మాత్రమే వస్తాయని అయితే తాజాగా లారెన్స్ సినిమాకి కూడా ఈ విధమైన కలెక్షన్లు రావడం నిజంగా ఆశ్చర్యం అని కోలీవుడ్ ఇండస్ట్రీ ట్రేడ్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి.

Image result for kanchana 3 movie

గతంలో రజనీకాంత్ నటించిన పేట సినిమా దారుణంగా ఫ్లాప్ అయినా గానీ కలెక్షన్లు భీభత్సంగా రాబట్టింది. ఇదే క్రమంలో లారెన్స్ నటించిన కాంచన త్రీ సినిమా కూడా అదేవిధంగా కలెక్షన్లు రాబట్టడంతో రజనీకాంత్ అభిమానులతో పాటు రజినీకాంత్ కి కూడా షాక్ తగిలినట్లే న్యూస్ ఇది అని అంటున్నారు కోలీవుడ్ ఇండస్ట్రీ కి చెందినవారు.



మరింత సమాచారం తెలుసుకోండి: