గత కొంత కాలంగా మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయని ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఈ ఇబ్బందులు పడుతున్నారు.  ఆ మద్య టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుంది...నటించాలని వచ్చే ఎంతో మంది అమ్మాయిలను కొంత ఇండస్ట్రీకి చెందిన దుర్మార్గులు మభ్య పెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుంటున్నారని..సినిమా ఛాన్సులు ఇవ్వడం లేదని పెద్ద ఎత్తున ఉద్యమం తీసుకువచ్చింది నటి శ్రీరెడ్డి. 

ఇక బాలీవుడ్ లో మీ టూ ఉద్యమం నేపథ్యంలో తనూ శ్రీ దత్త ప్రముఖ నటుడు నానా పటేకర్ పై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.  ఇంత జరుగుతున్నా కొంత మంది తమ పద్దతులు మాత్రం మార్చుకోవడం లేదు.  ఈ మద్య ఓ యువతి యాక్టింగ్ నేర్పించాలంటే నీ డ్రెస్ తీసేయమని చెప్పాడంటూ తమ యాక్టింగ్ స్కూల్ టీచర్ పై కేసు పెట్టిన విషయం తెలిసిందే. 

ఆ యాక్టింగ్ టీచర్ పేరు వినయ్ వర్మ..ఇప్పటికే కొన్ని సినిమాల్లో కూడా నటించారు. తన వద్ద నటన నేర్చుకోవాలంటే బట్టలు విప్పాలని.. బట్టలు విప్పి నేర్చుకుంటేనే నటన బాగా వస్తుందని యువతులపై ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో ఓ యువతి షీ టీమ్స్ కు ఫిర్యాదు చేయగా వినయ్ వర్మపై నారాయణగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే, తాను 20 ఏళ్లుగా ఇలానే నటన నేర్పిస్తున్నానని.. నటించే వారికి తన దృష్టిలో ఆడా, మగా అనే తేడా ఉండదని, వారిని ఒక మిషన్ గానే చూస్తానని వినయ్ వర్మ చెబుతున్నాడు.

యాక్టింగ్ స్కూల్ లో బట్టలు తీయమన్నది నిజమే  అయితే నేను పై దుస్తులు మాత్రమే తీయమని చెప్పాను తప్ప లో దుస్తులు కాదు. ఇదే విషయాన్నీ నేను పోలీసులకు తెలిపాను. ఆమెకు యాక్టింగ్ రాదు. అందుకే నాపై ఇలా అబద్దాలు చెప్పింది నిందితుడు అంటున్న విషయం తెలిసిందే.   తాజాగా సూత్రదార్ నిందితుడు వినయ్ వర్మ ని అరెస్ట్ చేశారు పోలీసులు.   వినయ్ పై నిర్భయ కేసు నమోదు చేశారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: