షకలక శంకర్.. జబర్దస్త్ ద్వారా బాగా పాపులర్ అయిన నటుడు.. ఆ తర్వాత సినిమాల్లోనూ అడుగుపెట్టి హీరోగా కూడా చేశాడు. అయితే ఈ రోజు షకలక శంకర్ పుట్టినరోజు.. కానీ హఠాత్తుగా ఈ రోజు శకలక శంకర్‌ గు గుండెపోటు వచ్చిందని.. పరిస్థితి బ్యాడ్ గా ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. 


ఈ ప్రచారం బాగా వైరల్ కావడంతో దీనిపై షకలక శంకర్ స్నేహితుడు మరో జబర్దస్‌ ఆర్టిస్టు గెటప్ శ్రీను స్పందించాడు. సెల్‌ ఫోన్‌ ద్వారా తన స్పందనను వీడియో రూపంలో పోస్ట్ చేశాడు.. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. సదరు షకలక శంకర్ ఈ వీడియోలో గెటప్ శ్రీను పక్కనే ఉన్నాడు. 

గతంలోనూ ఇలాగే రంగస్థలం మహేశ్ విషయంలోనూ జరిగిందంటున్నాడు గెటప్ శ్రీను. జబర్దస్‌ నటులపై ఇలాంటి దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయని వాటిని నమ్మవద్దని గెటప్ శ్రీను సూచించాడు. తన పక్కనే ఉన్న షకలక శంకర్‌తోనూ మాట్లాడించాడు. 

పనీ పాటా లేకుండా ఇలాంటి ప్రచారాలు చేస్తే ఏం వస్తుందంటూ శకలక శంకర్ కాస్త ఘాటుగానే రియాక్టయ్యాడు. ఇంకా వేరే పనేమీ ఉండదా.. ఎందుకు ఇలాంటి పుకార్లు పుట్టిస్తారని ఓ రేంజ్‌ లో ఫైర్ అయ్యాడు. అదీ అసలు సంగతి. 



మరింత సమాచారం తెలుసుకోండి: