సెలెబ్రెటీల నుండి సామాన్య ప్రేక్షకుల వరకు ఇప్పుడు అందరు మాట్లాడుకుంటున్న మూవీ ‘జెర్సీ’ ఒక కమర్షియల్ హీరో సినిమాను  ట్రాజడీ చేసి సూపర్ హిట్ సాధించడం ‘జెర్సీ’ లోని ప్రత్యేకత. భావోద్వేగంతో నిండిన ఈమూవీ ముగింపు విమర్శకుల నుండి సామాన్య ప్రేక్షకుల వరకు కనెక్ట్ అవ్వడంతో ‘జెర్సీ’ పై కలక్షన్స్ తో కూడిన ప్రశంసలు లభిస్తున్నాయి. 

ఈ నేపధ్యంలో ఇలాంటి ప్రయోగానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు బన్నీ దర్శకుడు వేణు శ్రీరామ్ మూవీలో ఇలాంటి ప్రయోగం చేయబోతున్నాడని టాక్. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి వేణు శ్రీరామ్ ఫైనల్ చేసిన స్క్రిప్ట్ లో రెండు రకాల క్లైమాక్స్ లు దర్శకుడు శ్రీరామ్ బన్నీకి సూచించినట్లు టాక్.

ఈ మూవీ ‘ఐకాన్’ కథకు సంబంధించి యాంటీ క్లైమాక్స్ ఉంటుందని తెలుస్తోంది. అయితే అల్లు అర్జున్ ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని ఓకె చేసి క్లైమాక్స్ ను మార్చమని వేణు శ్రీరామ్ కు కొద్దిరోజుల క్రితం చెప్పినట్లు సమాచారం. అయితే ‘జెర్సీ’ సూపర్ హిట్ కావడంతో విషాదాంతంతో ఉన్న సినిమాలు కూడ హిట్ అవుతాయి అన్న నమ్మకం బన్నేకి ఏర్పడటంతో వేణు శ్రీరామ్ ఆలోచనలకు అనుగుణంగా యాంటీ క్లైమాక్స్ సీన్స్ కు ఓకె చెప్పినట్లు తెలుస్తోంది. 

గతంలో అల్లు అర్జున్ పాత్ర చనిపోయే ‘వేదం’ మూవీలో కేబుల్ రాజ్ పాత్రలో క్రిష్ దర్శకత్వంలో నటించి మెప్పించాడు. అయితే ఆ తరువాత బన్నీ ఇమేజ్ లో చాల మార్పులు వచ్చి ఇప్పుడు టాప్ హీరోల లిస్టులో కొనసాగుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో అల్లు అర్జున్ పై ‘జెర్సీ’ క్లైమాక్స్ ప్రయోగాలు చేస్తే ఆమూవీ బయ్యర్లు అంగీకరిస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: