Image result for Rashi khanna ad shoots

“ఊహలు గుసగుస లాడే” చిత్రం తో "సొగసులు మిసమిస లాడే" అన్నట్లుగా ఉన్న ఈ డిల్లీ పిల్ల రాశీ ఖన్నా తెలుగు చిత్ర సీమకు పరిచయమైన రాసులు పోసిన అందం మాత్రమే కాదు, అభినయ అభిసారిక ..సరసిజ నయన కూడా!  “అంగడిలో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని” అన్నట్లు - టాలీవుడ్ లో ‘గ్లామర్ ప్లస్ టాలెంట్ ‘ రెండూ హై డోస్' లో ఉండి కూడా స్టార్-లీగ్ కు చేరలేకపోయిన హీరోయిన్లలో రాశి ఖన్నా ఒకరు. మొదట్లో అందరూ రాశిని ‘గ్లామర్ క్వీన్’ అనుకున్నారు

Related image

కానీ వరుణతేజ్ 'తొలిప్రేమ' లో ఆమె నటన పాతతరం కథానాయికలను గుర్తు చేసింది ఆ సూపర్ హిట్ తర్వాత తెలుగు ప్రేక్షకులు ఆమె గ్లామర్ మాత్రమే కాదు వెండితెరపై నటనను కూడా పండించగలదని గుర్తించారు. కాని వెంటనే వచ్చిన 'శ్రీనివాస కళ్యాణం' పై భారీ ఆశలు పెట్టుకున్న ఆమెను ఆ సినిమా తీవ్ర నిరాశపరించింది. కానీ ఇప్పుడు క్రేజీ మల్టి స్టారర్ 'వెంకీమామ' లో నాగ చైతన్య తో జోడీ కడుతోంది.

Image result for erotic rashi khanna

సినిమాలే కాకుండా రాశి అప్పుడప్పుడూ షోరూం ప్రారంభోత్సవాలకు హాజరై రిబ్బన్స్ కట్ చేస్తూ ఉంటుంది యాడ్స్ లో కూడా మెరుపు తీగలా మెరుస్తూ ంఅల్లెల సుగంధాలను విరజిమ్ముతుంటుంది.


రీసెంట్ గా ఈ దివిజ గంగ ఒక యాడ్ షూట్ లో పాల్గొంది. ఆ షూట్ కు సంబంధించిన ‘బిహైండ్ ది సీన్స్’వీడియోను తన ఇన్స్టా-గ్రాం లో షేర్ చేసింది. ఈ వీడియోకు "అటూ ఇటూ ఊగుతున్నాను. # బిహైండ్ ది సీన్స్.. #బ్రాండ్ షూట్" అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వీడియోలో రాశి పింక్ కలర్ ఛోళీ, లెహెంగా పైన, అదే కలర్ మ్యాచింగ్ చున్నీ వేసుకొని సూపర్ గా డ్యాన్స్ వేస్తూ ఉంది. రాశి తో పాటు మరో తొమ్మిది పది మంది అందాల ప్రియ సఖులు రాశి మాదిరి గానే  అటూ ఇటూ ఊయలలూగుతూ డ్యాన్స్ చేస్తూ కనువిందు చేస్తున్నారు.  

Related image

ఈ వీడియో మొత్తం మీద డ్యాన్స్ ఒక్కటే హైలైట్ అనుకుంటే మీకంటే మీకు కళాస్వాదన తెలియని తింగరోళ్ళ కిందే లెక్క. రాసులు పోసిన సొగసుల అందాలను వీక్షించటం ఆస్వాదించడంలో కూడా కాస్త మెళుకువ నైపుణ్యం ఉండాలి. 

Related image

అదేదో మీరే చెప్పి పుణ్యం కట్టుకోండి… ఎంతసేపూ మేమే రాయాలా? మీరు చెప్పరా? కనీసం మీ స్పందనతో రాతల ద్వారా మా వైపుకు ప్రవహించండి మరి? రసఙ్జత ఆస్వాదకులైతే కాస్త మీరే  వివరించండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: