ముంబైలో మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టి టాలీవుడ్ లో హీరోయిన్ భూమిక నిర్మించిన తకిట తకిట అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజమండ్రి కుర్రాడు హర్షవర్ధన్ రాణే. ముంబైలో ఫాషన్ కెరియర్ ఆరంభించిన ఈ కుర్రాడు తెలుగులో 'నా ఇష్టం, అనామిక, అవును,బ్రదర్ ఆఫ్ బొమ్మాలి లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించాడు. అయితే ఈ కుర్ర హీరోకి టాలీవుడ్ లో హీరోగా పెద్దగా అవకాశాలు రాలేదు. ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే తన  జర్నీ సాగిస్తూ ఉన్నాడు.

 

ఇదిలా ఉంటే ఈ కుర్రాడు బాలీవుడ్ లో మాత్రం జాన్ అబ్రహం నిర్మించిన సినిమాలో హీరోగా నటించాడు. ఆయితే ఆ సినిమా కాస్తా డిజాస్టర్ గా మారడంతో కుర్రాడు అక్కడ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, హీరోకి తక్కువ అయిపోయాడు. దీంతో తనకి అలవాటైన మోడలింగ్ ఫీల్డ్ లో  మళ్ళీ ఎదిగే ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ఈ హీరో గత కొంత కాలంగా ఒకప్పటి యువరాజ్ సింగ్ గర్ల్ ఫ్రెండ్ కిమ్ శర్మతో గత కొంత కాలంగా డేటింగ్ చేస్తున్నాడు. త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకుంటారని టాక్ బీటౌన్ లో వినిపించింది.  వీరి రిలేషన్ ఈ మధ్య అక్కడ కొంచెం హాట్ టాపిక్ అయింది.


ఎన్నారైని పెళ్లి చేసుకొని తరువాత విడాకులు తీసుకొని ఇండియా తిరిగి వచ్చేసిన ఈ భామ ముంబైలో సినిమా అవకాశాల కోసం ట్రై చేస్తూనే హర్షవర్ధన్ ని లైన్ లో పెట్టింది. అయితే మళ్ళీ ఈ మధ్య వీరిద్దరి మధ్య ఏం జరిగిందో తెలియకపోయినా తాజాగా ఇద్దరు బ్రేక్ అప్ చెప్పుకున్నట్లుసోషల్ మీడియా ద్వారా హర్షవర్ధన్ తెలిపాడు.. అంతేకాదు కిమ్ శర్మను ఉద్దేశించికృతజ్ఞతలు చెబుతూ నీకు, నాకు దేవుడి ఆశీస్సులు ఉంటాయంటూ పోస్ట్ పెట్టాడు. మొత్తానికి ఈ హాట్ కపుల్ ఇన్ని రోజులు హల్చల్ చేసి ఇప్పుడు ఉన్నపళంగా ఇలా బ్రేక్ అప్ చెప్పుకోవడానికి కారణాలు ఏంటి అనేది బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: