తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన షోలలో ప్రముఖ షో బిగ్ బాస్ షో. ముఖ్యంగా మొదటి సీజన్లో బిగ్ బాస్ షో కి యాంకర్గా వ్యవహరించిన జూనియర్ ఎన్టీఆర్ ఆ సమయంలో తెలుగు టెలివిజన్ ప్రేక్షకుల హృదయాలను ఎంతగానో దోచుకున్నారు. రెండవ సీజన్ కంటే మొదటి సీజన్ కి మంచి హైప్ వచ్చింది. ఇక రెండో సీజన్ విషయానికొస్తే యాంకర్ గా న్యాచురల్ స్టార్ నాని వ్యవహరించారు...యాంకరింగ్ లో జూనియర్ ఎన్టీఆర్ తో నాని నీ పోలిస్తే పెద్దగా మెప్పించలేకపోయారు అనే కామెంట్ అప్పట్లో వినబడ్డాయి.

Image result for meelo evaru koteeswarudu nagarjuna

అంతేకాకుండా మొదటి సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్ ల కంటే రెండవ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ లు అసలు సెలబ్రిటీ లేనా అన్నట్టుగా ఎంచుకొన్నారు షో నిర్వాహకులు. ఈ నేపథ్యంలో తాజాగా మొదలు కాబోతున్న 3వ సీజన్ బిగ్ బాస్ షో కి భారీగా ప్లాన్ చేశారు షో నిర్వాహకులు. ఈ క్రమంలో మొదలు కాబోతున్న మూడవ సీజన్ కి కింగ్ నాగార్జున ను హోస్ట్ గా తీసుకున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

Related image

గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంతో ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న నాగార్జున తాజాగా బిగ్బాస్ సీజన్ మూడవ భాగంలో వస్తున్నట్లు వార్తలు బయటకు రావడంతో చాలామంది తెలుగు టెలివిజన్ ప్రేక్షకులు బిగ్బాస్ మూడవ సీజన్ కోసం ఎంతో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: