టాలీవుడ్ లో దేవదాసు సినిమాతో హీరోగా పరిచయం అయిన రామ్ ప్రస్తుతం స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు.  ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘ఇ స్మార్ట్ శంకర్’సినిమాలో నటిస్తున్నాడు.  ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే రామ్ తాజాగా తెలంగాణ లో ఇంటర్ బోర్డ్ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు రామ్ పోతినేని.  ఇంటర్‌ను అసలు లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని పేర్కొన్నాడు. ఇంటర్ పాసవడమే జీవితం అనుకుంటే, తానసలు ఇంటరే పూర్తిచేయలేదన్నాడు. 

ఇంటర్ మొదటి సంవత్సరం ఫెయిల్ అయినా..రెండో సంవత్సరం ఫస్ట్, సెకండ్ ఇయర్ కష్టపడి పాస్ కావొచ్చు..అంతేకాని ఫెయిల్ అయ్యామని మనసు బాధపెట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటే తల్లిదండ్రులను క్షోభ పెట్టినట్టే అవుతుందని అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలన్నీ ఇంటర్ బోర్డు హత్యలుగా అభివర్ణించిన రామ్.. జీవితంలో అవబోయేదానికి, చేయబోయేదానికి ఇంటర్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరమే లేదని, ఆ మాటకొస్తే తానసలు ఇంటరే పూర్తిచేయలేదని పేర్కొన్నాడు.


ఇక దర్శకులు మారుతి మాట్లాడుతూ.. పరీక్షలు మనలోని నైపుణ్యాన్ని, భవిష్యత్తును నిర్ణయించలేవని, తాను చదువులో యావరేజ్ స్టూడెంట్‌నని పేర్కొన్నాడు.  ఇక టెక్నికల్ వర్క్ మన నైపుణ్యం పై ఆధారపడి ఉంటుందని..యానిమేషన్‌లో మాత్రం తాను టాపర్‌నని గుర్తు చేసుకున్నాడు. తాను చదవిన చదువు తనను దర్శకుడిగా మార్చలేదన్నాడు. సినిమాలపై తనకున్న అభిరుచే ఇటువైపు నడిపించిందన్నాడు.

ఫెయిల్ అయ్యామంటే..మరోసారి ఎగ్జామ్ రాసుకునే వీలు ఉంటుంది..కానీ ఆత్మహత్య చేసుకుంటే మళ్లీ బతుకుతామా? అలాంటి తప్పుడు ఆలోచనే మనసులోకి రానివ్వకుండా చూడాలి.  తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, పరీక్షల పేరుతో ఒత్తిడి తీసుకురావొద్దని సూచించాడు. బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: