అక్కినేని కోడలు సమంత ఏంటి దర్శక నిర్మాతలను భయపెట్టడం ఏంటని ఆశ్చర్యపోవచ్చు. ఏ హీరోయిన్ అయినా పెళ్లి తర్వాత ఫాం తగ్గిపోతుంది కాని సమంత మాత్రం ఇంకా స్టార్ హీరోయిన్ గానే చెలామణి అవుతుంది. పెళ్లి తర్వాత కూడా సమంత తన క్రేజ్ కొనసాగిస్తుంది. ఈమధ్యనే మజిలీ సినిమాతో సంచలన విజయం అందుకుంది సమంత.


నటనలో ఆమెను మించిన వారే లేరనేలా మజిలీలో శ్రావణి పాత్రకు న్యాయం చేసింది సమంత. అయితే ఇవన్ని బాగున్నా ఇప్పుడు సమంతతో సినిమా అంటే భయపడేలా చేస్తుందట అమ్మడు. అదేలా అంటే పెళ్లి తర్వాత అవకాశాలు ఎక్కువవడంతో సామ్ తన రెమ్యునరేషన్ కూడా పెంచేసిందట.


పెళ్లికి ముందు కోటి, కోటిన్నర మాత్రమే తీసుకునే సమంత ఇప్పుడు వరుస సూపర్ హిట్లు కొడుతుండటంతో పారితోషికం పెంచేసిందని తెలుస్తుంది. ప్రస్తుతం సమంతతో సినిమా అంటే రెండున్నర నుండి 3 కోట్లు రెమ్యునరేషన్ ఇస్తేనే అన్నట్టుగా చెబుతుందట. సమంత రెమ్యునరేషన్ డిమాండ్ చూసి దర్శక నిర్మాతలు షాక్ అవుతున్నారు.


ప్రస్తుతం ఓ బేబీ, 96 రీమేక్ గా వస్తున్న జాన్ సినిమాల్లో నటిస్తున్న సమంత ఈ రెండు సినిమాలకు కూడా భారీ రెమ్యునరేషన్ తీసుకుంటుందని తెలుస్తుంది. తెలుగు సినిమాలకు చూసి చూడనట్టు వదిలేస్తున్నా తమిళ సినిమాలకు మాత్రం సమంత అడిగినంత ఇవ్వాల్సిందే అంటూ చెబుతుందట. పెళ్లి తర్వాత సమంత ఫాం చూసి మిగతా హీరోయిన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: