Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Fri, May 24, 2019 | Last Updated 5:38 pm IST

Menu &Sections

Search

తెలుగు 'బిగ్ బాస్' షో సీజన్ -3 హోస్ట్ ఎవరూ..?

తెలుగు 'బిగ్ బాస్' షో సీజన్ -3 హోస్ట్ ఎవరూ..?
తెలుగు 'బిగ్ బాస్' షో సీజన్ -3 హోస్ట్ ఎవరూ..?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

'బిగ్ బాస్' రియాలిటీ షోకి ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ ఉండటంతో తెలుగులోనూ ప్రయోగాత్మకంగా నిర్వహించి సక్సెస్ అయ్యారు. వివాదాస్పద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ మూడో సీజన్ కోసం చాలా మంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్... సీజన్ 1, సీజన్ 2లకు ప్రేక్షకాదరణ లభించడంతో సీజన్ 3కి సన్నాహాలు మొదలయ్యాయి.


ఇక 'బిగ్ బాస్' మొదటి సీజన్ 2017 జూలైలో ప్రారంభం కాగా.. రెండో సీజన్ ఒక నెల ముందుగానే అంటే 2018 జూన్‌లోనే ప్రారంభమైంది. ఇక మూడో సీజన్‌కి సంబంధించి ఏప్రిల్ నెల వచ్చేస్తున్నా కసరత్తులు నత్తనడకన సాగుతున్నాయి.  గొడవలు, వివాదాలతో కూడిన రెండో సీజన్‌ను బాగా ఎంజాయ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు మూడో సీజన్ కోసం చూస్తున్నారు. అయితే, ఈ షోను ప్రసారం చేసే స్టార్ మా ఛానెల్ వ్యాఖ్యాత కోసం అన్వేషణలో ఉంది.


రెండో సీజన్‌కు హోస్ట్‌గా చేసిన నానిపై నెగిటివ్ టాక్ రావడంతో సీజన్-1కు వ్యాఖ్యాతగా చేసిన యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌నే తీసుకోవాలని స్టార్ మా ప్రయత్నించింది.  అయితే ‘బిగ్ బాస్ 3’ కి తాను వ్యాఖ్యాతగా వ్యవహరించలేనని ఎన్టీఆర్ చెప్పడంతో స్టార్ మా డైలామాలో పడింది. అయితే కీలకమై హోస్ట్ కోసం ఇంకా వెతుకులాట సాగుతూనే ఉంది. నాని, ఎన్టీఆర్, రానా, విజయ్ దేవరకొండ, చిరంజీవి, నాగార్జున ఇలా చాలా పేర్లు వినిపించినప్పటికీ కొత్తగా ఈసారి హీరోలు కాకుండా హీరోయిన్‌ హోస్ట్ చేసే అవకాశం ఉందంటూ ప్రచారం నడుస్తోంది. 


విచిత్రంగా అనుష్క పేరు తెరపైకి వచ్చింది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ నిర్వాహకులకు ఇప్పుడు మంచి ఆప్షన్ దొరికిందట. కానీ అనుష్క దీనికి సరే అంటుందా లేదా అనేది వేచిచుడాల్సి ఉంది. మరోవైపు అక్కినేని నాగార్జున పేరు ఇప్పుడు మరింత బలంగా వినిపిస్తుంది.  గతంలో మీలో ఎవరు కోటీశ్వరుడు హోస్ట్ గా చేసిన నాగ్ కే ఈ సారి చాన్నులు ఎక్కువగా ఉంటాయంటున్నారు. మరి చూడాలి బిగ్ బాస్ 3 కి ఎవరు వ్యాఖ్యతగా రాబోతున్నారో.


telugu-big-boss-session-3-jr-ntr-nani-nagarjuna-an
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author