రాజమౌళి ‘బాహుబలి’ తో నేషనల్ సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ ఆ ఇమేజ్ ని కొనసాగించుకోవడానికి ‘సాహో’ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ప్రభాస్ ‘సాహో’ ఊహించని విధంగా రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ కు సమస్యగా మారడం హాట్ టాపిక్ గా మారింది. 

బ్రిటీష్ బ్యూటీ డైసీ ‘ఆర్ ఆర్ ఆర్’ నుండి తప్పుకోవడంతో హీరోయిన్స్ విషయంలో రాజమౌళి ఆలోచనలు మారాయి. ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హీరోయిన్స్ తోనే కథ నడిపించాలని రాజమౌళి తన ప్రయత్నాలు మరింత వేగంగా కొనసాగిస్తూ ఈమూవీ విషయమై ‘సాహో’ హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ తో రాయబారాలు చేసినప్పుడు ఆమె దగ్గర నుండి రాజమౌళి ఊహించని సమాధానం వచ్చినట్లు టాక్. 

‘సాహో’ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా వేగంగా పూర్తి అవ్వకపోవడంతో శ్రద్ధా కపూర్ ఈసినిమాకు అనేకసార్లు డేట్స్ ఇవ్వవలసి వచ్చినట్లు టాక్. దీనితో ఆమె దక్షిణాది సినిమాలు అన్నీ ఇలా ఆలస్యంగా పూర్తి అవుతాయని అన్న అభిప్రాయంలోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికితోడు రాజమౌళి సినిమాలు అంటేనే చాల ఆలస్యంగా పూర్తి అవుతాయని వార్తలు ఉండటంతో ఈవిషయాలు అన్నీ దృష్టిలో పెట్టుకుని తాను ‘ఆర్ ఆర్ ఆర్’ లో నటించడానికి సమయం లేదు అనీ సున్నితంగా తప్పించుకున్నట్లు టాక్. 

అయితే వాస్తవానికి శ్రద్ధా కపూర్ అలియా భట్ అంత బిజీగా కూడా లేదు. ‘సాహో’ ఎలాగూ ఫినిషింగ్ స్టేజిలో ఉంది. తన భాగం దాదాపు పూర్తయినట్టే. ఇది కాకుండా బాలీవుడ్ మూవీలు ‘చిచొరే’ తో పాటు ‘స్ట్రీట్ డాన్సర్’ మూవీలలో మాత్రమే శ్రద్ధ ప్రస్తుతం నటిస్తున్న నేపధ్యంలో ఈమె రాజమౌళి ఆఫర్ ను తిరస్కరించడం వెనుక వేరే కారణాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది. ఏమైనా రాజమౌళి లాంటి క్రేజీ దర్శకుడు తీస్తున్న సినిమాకు కూడ హీరోయిన్ కష్టాలు ఏర్పడటం ఆశ్చర్యకరం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: