తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాలలో తేడాలు రావడంతో ఆ వివాదం రోజురోజుకు తారా స్థాయికి చేరుకుంటోంది. ఇంటర్మీడియట్ బోర్డు తప్పులతో సుమారు 16 మందిపైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈవివాదం పెనువివాదంగా మారి ఏకంగా హైకోర్టు మెట్లు ఎక్కింది. ఇంటర్మీడియట్ ఫలితం తేడా వచ్చినంత మాత్రాన జీవితంలో నష్టం లేదు అంటూ నిన్న దర్శకుడు మారుతి తాను పెద్దగా చదువుకోలేదు అంటూ విద్యార్థులకు ధైర్యం చెపుతూ నిన్న ట్విట్ చేశాడు. 

ఇదే బాటను అనుసరిస్తూ హీరో రామ్ ఇంటర్మీడియట్ మార్కులు జీవితం కాదు అంటూ విద్యార్థులు ధైర్యంగా ఉండాలని ట్విట్స్ పెట్టి అనుకోకుండా వివాదాలలో ఇరుక్కున్నాడు. దీనికి కారణం రామ్ పెట్టిన ట్విట్స్ మధ్య అతడికి తెలియాకుండానే ఒక బూతు పదం వచ్చేసింది. దీనితో రామ్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ వస్తున్నాయి. 

తల్లిదండ్రులు బాగా డబ్బులు సంపాదిస్తే టెన్త్ ఫెయిలైనా ఫర్వాలేదంటూ రామ్ పై విరుచుకుపడ్డారు నెజిజన్లు. ఇంటర్మీడియట్ ఫెయిలైనా ఎన్ని సినిమాలు ఫ్లాప్ అయినా ఏం ఫర్వాలేదంటూ రామ్ ను టార్గెట్ చేస్తూ సెటైర్లు కూడ వేస్తున్నారు. విద్యార్థుల సమస్యలకు పరిష్కారాలు చెప్పాలి కానీ విద్యార్థులకు రివర్స్ క్లాస్ లు పీకడం ఏమిటి అంటూ రామ్ పై మాటల దాడి చేస్తున్నారు. 

కూలిపని చేసుకుంటూ తమ పిల్లలను కష్టపడి చదివించుకునే విద్యార్థుల కష్టాలు రామ్ కు తెలుసా అంటూ మరికొందరు ప్రశ్నలు వేస్తున్నారు. దీనితో జరుగుతున్న నష్టాన్ని గ్రహించిన రామ్ రంగంలోకి దిగి తన ట్విట్ విద్యార్థులకు ధైర్యం చెప్పే విధంగా మాత్రమే చేశానని ఆ ట్విట్ లో బూతులు వెతకవద్దు అంటూ రామ్ తన పై వస్తున్న మాటల దాడిని తగ్గించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు..      



మరింత సమాచారం తెలుసుకోండి: