ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు నాడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న అభిమానులు ఎంతగానో పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ఆ రోజు చాలా మంది రక్తదానం కూడా చేశారు. అయితే పుట్టిన రోజు నాడు రామ్ చరణ్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు దగ్గర బహుమతులు అందుకున్న జపాన్ దేశం నుండి తనకు చాలా బహుమతులు రావడంతో ఒక్కసారిగా షాక్ తిన్నట్లు వచ్చిన బహుమతులను ట్విట్టర్లో పెట్టి అందరికీ తన ఆనందాన్ని పంచుకున్నారు చెర్రీ.

Image result for ramcharan

రెండు తెలుగు రాష్ట్రాలలో చరణ్ అంటే అందరికీ తెలిసినదే కానీ జపాన్లో కూడా రామ్ చరణ్ కి ఇంత ఫాలోయింగ్ ఉందంటే దానికి కారణం రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన మగధీర సినిమా. మార్చి 27 చరణ్ బర్త్‌డే సందర్భంగా అభిమానులు జపాన్ నుంచి మగధీర పోస్టర్స్‌తో కూడిన గ్రీటింగ్ కార్డ్స్ పంపారు.

Image result for magadheera

వాటిని చూసిన చరణ్ స్పందిస్తూ జపాన్ అభిమానులు పంపిన ఈ కానుకను తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసాడు. నా పట్ల మీకున్న ఆదరాభిమానాలకు ఎంతో సంతోషంగా ఉంది. జపాన్ అభిమానులకు నా ధన్యావాదాలు తెలుపుకుంటున్నానని, త్వరలో జపాన్ వచ్చి అభిమానులను కలుస్తా అని ట్వీట్ కూడా చేశాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: