టాలీవుడ్ లో బడా ప్రొడ్యూసర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నిర్మాత దిల్ రాజు. ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత కూడా దిల్ రాజుకి సొంతం అవుతుంది. ఒక దర్శకుడుని నమ్మితే అతనికి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇవ్వడం, ఒక ఫెయిల్ అయిన కూడా మరో అవకాశం ఇవ్వడం దిల్ రాజు ప్రత్యేకత. ఇక కుర్ర హీరోలతో సినిమాలు తీసి సక్సెస్ కొట్టడంలో దిల్ రాజు ముందు వరుసలో ఉంటాడు.


అయితే టాలీవుడ్ లో చాలా మంది కుర్ర హీరోలు ఒకటి రెండు సక్సెస్ లు రాగానే రెమ్యునరేషన్ పెంచేసి, కొత్త కథల జోలికి పోకుండా తనకి అలవాటైన మూసలోనే సినిమాలలో నటిస్తూ ఉంటారు. ఇక ఇండస్ట్రీలో ప్రయోగాల జోలికి వెళ్ళే కుర్ర హీరోలు చాలా తక్కువ అని చెప్పాలి. దీంతో కుర్ర హీరోలకి కెరియర్ ఆరంభంలో సక్సెస్ ఉన్న తర్వాత నిలబడలేక క్రింద పడిపోతారు.


అయితే నాని లాంటి కొంత మంది హీరోలు మాత్రం ట్రెండ్ తో పాటు తమ స్టైల్ ని మార్చుకొని కొత్తకథలకి ప్రాధాన్యత ఇస్తూ వాటికి తగ్గట్లు తమని తాము మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తాజాగా నేచురల్ స్టార్ నాని వరుసగా రెండు ఫ్లాప్ ల తర్వాత దర్శకుడు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో క్రికెట్ బ్యాగ్రౌండ్ లో తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో జెర్సీతో ప్రేక్షకుల ముందుకి వచ్చి సాలిడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు.


తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత దిల్‌రాజు ప్రశంసిస్తూ, పెద్దగా అనుభవం లేకపోయినా, ఆయా పాత్రలచే దర్శకుడు ఆవిష్కరింపజేసిన ఎమోషన్స్ ప్రేక్షకుల మనసులను కట్టిపడేశాయి. నాని పారితోషికం గురించి మాట్లాడకుండా సినిమా బాగా ఆడితే షేర్ ఇస్తే చాలని చెప్పేసి రంగంలోకి దిగాడు. హీరోలు ఇలా డబ్బును దాటి ముందుకు వస్తేనే ఇలాంటి మంచి సినిమాలు వస్తాయి అని చెబుతూ పరోక్షంగా ఈ తరం కుర్ర హీరోలకి నేరుగా కౌంటర్ వేశాడని టాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్. చాలా మంది హీరోలు కథ కూడా వినకుండా రెమ్యునరేషన్ ఎంత అని అడుగుతూ ఉండటంతో దిల్ రాజు మండిపోయి ఇలా అన్నాడని చెప్పుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: