చాలాకాలానికి బాక్సాఫీస్ గలగలమంటోంది. చాలా రోజుల తరువాత తెలుగు రాష్ట్రాల్లోని సినిమా హాళ్ళు కలకల్లాడుతున్నాయి. బొమ్మ బాగుందన్న టాక్ తో క్యూలు ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు ఈ సమ్మర్ బాగా కలసివచ్చింది. ఓ  వైపు ఎన్నికలు ఐపోయాయి. మొదటి విడతలో ఎన్నికలు  పెట్టడంతో ఇపుడు ఎక్కడ చూసినా అంతా ఫ్రీ ఐపోయారు. ఇంకో వైపు పరీక్షలు కూడా అయిపోయి  టైం జనమంతా పాస్ కోసం ఎదురుచూస్తున్నారు.



సరిగ్గా టైం చూసుకుని వచ్చిన నాచురల్ స్టార్ నాని జెర్సీ మూవీ పెద్ద హిట్ ఐపోయింది. మూవీకి ముందే పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే బాక్సాఫీస్ షేక్ చేసింది. టాక్ కూడా బాగుండడంతో ఇపుడు సినిమా హాళ్ళలో జెర్సీ  పెద్ద హిట్ ఐ కూర్చుంది. నాని కెరీర్ లో ఇది మంచి హిట్ అని రాసేసుకోవచ్చు అంటున్నారు. ఈ దెబ్బతో నాని టాప్ పొజిషన్ కి వెళ్ళేందుకు రూట్ వేసుకున్నాడని కూడా అంటున్నారు.
ఇక జెర్సీ తో పాటు వచ్చిన కాంచన 3 మూవీ ఇపుడు పెద్ద హడావిడే చేస్తోంది.


ఈ మూవీ ఏం నమ్మకం పెట్టి లారెన్స్ తీశాడో కానీ తెలుగునాట కాసుల వర్షం కురిపిస్తోంది. ఎవరూ వూహించని విధంగా చాలా చోట్ల జెర్సీ కలెక్షన్లను కూడా దాటేస్తోందిట. ఇక ఇంతకు ముందే వచ్చిన నాగ చైతన్య మజిలి, సాయి తేజ్ చిత్రలహరి మూవీస్ రెండూ కూడా హిట్ బాట పట్టాయి. మరిన్ని మూవీస్ సమ్మర్ సీజన్లో రావడంతో ఈసారి నాలుగు డబ్బులు చూసేందుకు వీలవుతుందన్న ధీమా కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: