సైరా మూవీ టాలీవుడ్లో ప్రిస్టేజియస్ మూవీస్లో ఒకటి. ఓ విధంగా మన చరిత్రను వెండి తెరపై సాహసోపేతంగా లిఖిస్తున్న మూవీ ఇది. తొలి పోరాటయోధుడు, ఉయ్యాలవాడ నరసిమ్హారెడ్డి వీర గాధను భావితరాలకు అందించే అద్భుత ప్రయత్నం ఈ మూవీ. మెగాస్టార్ ఇందులో నటించడం. తనయుడు రాం చరణ్ నిర్మించడంతో ఈ మూవీపై గొప్ప అంచనాలు ఉన్నాయి. బాహుబలి తరువాత తెలుగు ఖ్యాతిని పెంచే మూవీగా కూడా దీన్ని అంతా భావిస్తున్నారు.


అయితే సైరా ఎపుడెపుడా అన్న ఆత్రుత మెగా ఫ్యాన్స్ తో పాటు మొత్తం ఆడియన్స్ కి ఉంది. తెలుగు తమిళ్, హిందీల్లో ఒకేమారు తీస్తున్న ఈ మూవీలో  హేమాహేమీల్లాంటి వారంతా నటిస్తున్నారు. ఈ మూవీ మొదట ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అన్నారు. తరువాత సమ్మర్ అని చెప్పారు. ఇక దసరా అని అంతా ఫిక్స్ అయిపోయిన వేళ ఇపుడు తాపీగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.


సైరా 2020 సంక్రాంతికి రిలీజ్ అన్నదే ఆ న్యూస్. సైరా అవుడోర్ వర్క్ దాదాపుగా ఫినిష్ అయిందంటున్నారు. మిగిలిన పనులన్నీ పూర్తి అయినా గ్రాఫిక్స్ మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారుట. దాంతో ఎక్కువ టైం దానికే పడుతుందని అంటున్నారు. అవన్నీ పూర్తి చేసుకుని సైరా బయటకు వచ్చేసరికి 2019 కి బై బై చెప్పేయాల్సిందేనని అంటున్నారు. మొత్తానికి సైరా చూడాలంటే మరో ఎనిమిది నెలలు ఆగాల్సిందేనన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: