విలక్షణ నటుడిగా కెరియర్ కొనసాగిస్తున్న బ్రహ్మాజీ ప్రస్తుతం చాలా సినిమాలలో నటిస్తున్నాడు. నటుడిగా ఇతడికి మంచి పేరు ఉండటంతో ఎలాంటి పాత్రలో అయినా బ్రహ్మాజీ ఒదిగిపోతాడు.  అయితే అలాంటి బ్రహ్మాజికి దిల్ రాజ్ చెక్ పెట్టిన విషయం పై ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి.  

నిర్మాతగా ఎంతో అనుభవం ఉన్న దిల్ రాజ్ ఒక సినిమాకు సంబంధించిన కథ విషయంలో మాత్రమే కాకుండా ఆసినిమాకు సంబంధించిన ఎడిటింగ్ విషయంలో కూడ ఇన్ వాల్వ్ అవుతూ ఉంటాడు. సినిమా నిర్మాణం పై తనకు ఉన్న ఆపార అనుభవంతో బయట సినిమాలకు కూడ  అప్పుడ‌ప్పుడూ తన స‌ల‌హాలూ సూచ‌న‌లూ అందిస్తుంటాడు.  

ఇలాంటి పరిస్థితులలో ‘జెర్సీ’ విజ‌యంలోనూ దిల్ రాజు హ్యాండ్ ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ‘జెర్సీ’ సినిమా విడుద‌ల‌కు ముందు ఈసినిమాను నిర్మాతలు దిల్‌ రాజుకి చూపించినట్లు టాక్. ఈమూవీ చాల బాగుంది అని చెపుతూ దిల్ రాజ్ ఈమూవీకి సంబంధించి సెకండ్ ఆఫ్ లో వచ్చే క్రికెట్ మ్యాచ్ సీన్ల‌ను దిల్‌ రాజు ద‌గ్గ‌రుండి కుదించాడని వార్తలు వస్తున్నాయి. 

అదేవిధంగా ఈమూవీ ఫస్ట్ ఆఫ్ లో ఒకే ఒక సీన్ లో కనిపించిన బ్రహ్మాజీ పాత్రకు సంబంధించి ఈమూవీ సెకండ్ ఆఫ్ లో ఒక కామెడీ ట్రాక్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ కామెడీ ట్రాక్ సీన్ బాగున్నా అప్పటికే ఈమూవీ సెకండ్ ఆఫ్ నిడివి పెరిగిపోయిన నేపధ్యంలో దిల్ రాజ్ సూచన మేరకు బ్రహ్మాజీ సీన్స్ ను కట్ చేసారని తెలుస్తోంది. దీనితో ఒక సూపర్ హిట్ అయిన మూవీలో బ్రహ్మాజీ ప్రాధాన్యత లేని పాత్రను పోషించవలసిన పరిస్థితి ఏర్పడింది అన్న కామెంట్స్ వస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: